వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సౌత్కరోలినాలో చర్చిలో కాల్పులు: 8మంది మృతి
న్యూయార్క్: అమెరికాలో దుండగులు మరోసారి తెగబడ్డారు. సౌత్కరోలినా చర్చిలో దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎనిమిది మృతి చెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చర్చిలో ప్రార్థనలు చేస్తున్న సమయంలో దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన బుధవారం జరిగినట్లు గురువారం అక్కడి పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన చాలా దురదృష్టకరమని చర్చి పాస్టర్ థామస్ డిక్సన్ అన్నారు. మృతులకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
కాగా, 20ఏళ్ల వయస్సున్న యువకులే ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గ్రే స్వేట్ షార్ట్, బ్లూ జీన్స్, బూట్లు ధరించారని చెప్పారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
church shooting south carolina suspect casualties police international crime చర్చి కాల్పులు సౌత్ కరోలినా అనుమానం పోలీసులు అంతర్జాతీయం నేరం
English summary
Several people have been killed in shooting reported at a historic church in South Carolina in US, media reported on Thursday.
Story first published: Thursday, June 18, 2015, 10:42 [IST]