వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గే విలేజ్: కత్తిపోట్లతో రక్తమోడిన ఇంగ్లాండ్ సెకెండ్ సిటీ: కార్డన్ అండ్ సెర్చ్

|
Google Oneindia TeluguNews

లండన్: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వెస్ట్ మిడ్‌ల్యాండ్ ప్రాంతంలో పలువురు స్థానికులు కత్తిపోట్లకు గురయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత 12:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కత్తిపోట్టకు కారణం ఎవరు? ఎందుకు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎంతమంది ఈ ఘాతుకానికి పాల్పడ్డారనేది ఇంకా తెలియరావాల్సి ఉంది.

ఒకరి కంటే ఎక్కువ మంది ఈ దారుణానికి ఒడి గట్టి ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించారు. బర్మింగ్‌హామ్ వెస్ట్ మిడ్‌ల్యాండ్‌లో ఈ ఘటన సంభవించింది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వెస్ట్ మిడ్‌ల్యాండ్ పోలీసులు వెల్లడించారు. కత్తిపోట్లకు గురైన వారిలో ఎంతమంది ప్రాణాపాయంలో ఉన్నారనేది ఇప్పుడే వెల్లడించలేమని తెలిపారు. ప్రస్తుతం కత్తిపోట్లకు గురైన వారిని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వెస్ట్ మిడ్‌ల్యాండ్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు.బర్మింగ్‌హామ్ గే విలేజ్‌ సహా పరిసర ప్రాంతాల్లో ఈ ఘటనలు సంభవించాయి. స్థానికంగా చోటు చేసుకున్న ఘర్షణలే దీనికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రెండు గ్రూపుల మధ్య ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయని గే విలేజ్‌లోని క్లబ్ ప్రమోటర్, ప్రత్యక్ష సాక్షి కారా తెలిపారు. ఇలాంటి సంఘటనలు తరచూ సంభవిస్తున్నప్పటికీ.. ఈ సారి కత్తిపోట్లకు దారి తీశాయని చెప్పారు.

Several stabbed in Birmingham, West Midlands Police said as major incident

Recommended Video

Mahatma Gandhi’s Glasses Sold for Rs 2.5 Crore in UK's Bristol Auction 6 నిమిషాల్లో 260,000 పౌండ్లు

సమాచారం అందుకున్న వెంటనే తాము సంఘటనా స్థలానికి చేరుకున్నామని వెస్ట్ మిడ్‌ల్యాండ్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయని, గాయపడ్డ వారికి చికిత్స అందించడానికి ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. వారిని ఆసుపత్రికి తరలించినట్లు తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటిదాకా ఈ ఘటనలో ఎవ్వరూ అరెస్టు కాలేదని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గాలిస్తున్నామని తెలిపారు. గే విలేజ్ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్‌ను చేపట్టినట్లు పేర్కొన్నారు.

English summary
British police declared a “major incident” early on Sunday after multiple people were stabbed in the centre of England’s second city Birmingham.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X