వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పదవీ బాధ్యతల సమయంలో ట్రంప్‌కు యువతి షాక్

అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే సమయంలో డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ తగిలింది. లైంగిక వేధింపుల వివాదాలు కోర్టుకు చేరాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే సమయంలో డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ తగిలింది. లైంగిక వేధింపుల వివాదాలు కోర్టుకు చేరాయి. సమ్మర్‌ జెర్వోస్ అనే యువతి ఆయన పైన పరువు నష్టం దావా వేసింది.

ఈ సందర్భంగా ఆమె తన లాయర్‌ గ్లోరియా అల్రెడ్‌తో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ట్రంప్‌ అబద్ధాల కోరు అని, మహిళా వ్యతిరేకి అన్నారు. 2007లో ఉద్యోగ అవకాశాల కోసం బెవర్లీ హిల్స్‌లోని హోటల్‌కు వెళ్తే ట్రంప్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడన్నారు.

<strong>డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక, భయంలేని సత్య నాదెళ్ల</strong>డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక, భయంలేని సత్య నాదెళ్ల

దీనిపై జాతికి అబద్ధాలు చెప్పాడన్నారు. అతని మాటలను వెనక్కి తీసుకోవాలని కోరినా ఇప్పటి దాకా స్పందించలేదన్నారు. దీంతో తన గౌరవాన్ని కాపాడుకోవటానికి కోర్టుకు వచ్చినట్లు చెప్పారు. ఆమె వ్యాఖ్యలపై ట్రంప్ స్పందిస్తూ.. ఆరోపణలు హాస్యాస్పదమని, అబద్ధాలని ట్రంప్‌ కొట్టిపారేశారు.

Sex Assault Accuser Summer Zervos Files Defamation Lawsuit Against Trump

వారం క్రితమే, ట్రంప్‌కు మరో వివాదం చుట్టుకుంది. ఆయన ఇచ్చే విందు సందర్భంగా వేదిక వద్ద చిత్రం ఏర్పాటు విషయంలో ఈ వివాదం మొదలైంది. 1855లో అమెరికా చిత్రాకారుడు జార్జి కాలేబ్‌ బింగామ్‌ వేసిన ప్రజాతీర్పు (వెరిడిక్ట్‌ ఆఫ్‌ ది పీపుల్‌) అనే చిత్రాన్ని అధ్యక్షుడి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఏర్పాటు చేయనున్నారు.

1985లో రొనాల్డ్‌ రీగన్‌ కాలం నుంచి అధ్యక్షుడు ఇచ్చే విందు సందర్భంగా దీనిని ఏర్పాటు చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఇది సెయింట్‌ లూయిస్‌ మ్యూజియంలో ఉంది. దీనిని ట్రంప్‌ విందుకు పంపించకూడదని చరిత్రకారులు స్థానికులు కోరుతున్నారు.

<strong>ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వెళ్లను: ఇండియన్ అమెరికన్ ప్రమీల</strong>ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వెళ్లను: ఇండియన్ అమెరికన్ ప్రమీల

ఆయన విజయంలో ప్రజాతీర్పులేదని వారు చెప్పారు. చరిత్రకారుడు కూపర్‌ మాట్లాడుతూ.. ట్రంప్‌ కంటే హిల్లరీకే ఎక్కువ ఓట్లు వచ్చాయని, ఆయన అధ్యక్షుడు అవ్వటంలో ప్రజాతీర్పు ఎక్కడిదని ప్రశ్నించారు.

కాగా, స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రఫెల్‌ నాదల్‌కు అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అంటే ఇష్టం లేదట. ట్రంప్‌పై తనకున్న అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కాడు అతను.

ఈ ప్రపంచంలో ట్రంప్‌ తన సొంత నమ్మకాలతో ఆధిపత్యాన్ని ప్రదర్శించలేరన్నాడు. ట్రంప్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను అమెరికాలో ఉన్నానని చెప్పాడు. ట్రంప్ మాట్లాడిన తీరు మెచ్చుకోనని, అమెరికా రాజకీయాలపై తనకు అవగాహన లేదన్నాడు.

English summary
Sex Assault Accuser Summer Zervos Files Defamation Lawsuit Against Trump.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X