వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐసిస్ ఘాతుకం: ఇక్కడ సెక్స్ బానిసలు, స్వర్గంలో కన్యలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇక్కడ అమ్మాయిలు ఎంతగా సెక్స్ బానిసలుగా ఉన్నప్పటికీ స్వర్గంలో మాత్రం వారు కన్యలేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల (ఐసిస్) వాదన. మహిళలను ఐసిస్ ఉగ్రవాదులు సెక్స్ బానిసలుగా చేసుకుంటున్న విషయం తెలిసిందే. వారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు.

ఐసిస్ విషయమై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఇటీవల జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ) ఐసిస్‌లో చేరాలనుకున్న వారిని అడ్డుకుంది. వారిని అదుపులోకి తీసుకొని విచారించింది. ఆరుగురిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.

వల వేసిన సోదరులు

వల వేసిన సోదరులు

నాలుగు నెలలుగా ఎన్ఐఏ వారి పైన కన్నేసింది. చివరకు రెండు రోజుల క్రితం ఐసిస్ వైపు మొగ్గు చూపారనే పక్కా సమాచారంతో అరెస్టు చేశారు. ప్రస్తుతం వారు జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. వీరిని షఫీ అమర్ ఐసిస్ వైపు మళ్లించాడని తెలుస్తోంది. ఇతను సుల్తాన్ అమర్ సోదరుడు. వీరిద్దరు కూడా కర్నాటకకు చెందిన వారు. భక్తలు కూడా ఇక్కడి వాడే. ఇతను ఇండియన్ ముజాహిదీన్‌ వ్యకక్తి అని తెలిసిందే.

యువతను ఐసిస్ వైపు

యువతను ఐసిస్ వైపు

యువతను ఐసిస్ వైపు మళ్లించేందుకు భక్తల్.. అన్సర్ ఉల్ తవ్‌‌హిద్ అనే రిక్రూట్‌మెంట్ సంస్థను భారత దేశంలో ప్రారంభించాడు. దీని ద్వారా షఫీ అమర్, సుల్తాన్ అమర్ (సోదరులు) యువతను ఆకట్టుకునేవారు.

జాయినయ్యే టైంలో ఆప్షన్

జాయినయ్యే టైంలో ఆప్షన్

రిక్రూట్మెంట్ సమయంలోనే.. ఇందులో జాయిన్ అయ్యేవారు సిరియాలో లేదా ఇరాక్‌లో చేరవలసి ఉంటుందని చెప్పేవారని తెలుస్తోంది. అంతేకాదు, ఐసిస్‌లో చేరే వారికి మంచి జీవితం ఉంటుందని హామీ ఇచ్చేవారు. యువతులకు కూడా మంచి జీవితం గురించి హామీ ఇచ్చేవారని తెలుస్తోంది.

సెక్స్ బానిసలు.. స్వర్గంలో కన్యలు

సెక్స్ బానిసలు.. స్వర్గంలో కన్యలు

అయితే, ఇక్కడ (భూమి పైన) మీరు సెక్స్ బానిసలుగా ఉన్నప్పటికీ స్వర్గంలో మాత్రం కన్యలుగానే ఉంటారని ప్రామిస్ చేసేవారని తెలుస్తోంది. మీరు ఓ మంచి కారణం కోసం పోరాడుతున్నారని వారికి నూరిపోసేవారని తెలుస్తోంది.

ఖలీఫా రాజ్యం

ఖలీఫా రాజ్యం

అంతేకాదు, అందులో చేరే వారికి ఓ ఆప్షన్ కూడా ఇచ్చేవారని తెలుస్తోంది. తిరిగి భారత్ రావాలనుకుంటే రావొచ్చునని లేదా దాడిలో పాల్గొనాలనుకున్నా పాల్గొనవచ్చునని చెప్పేవారని తెలుస్తోంది. ప్రపంచాన్ని ఖలీఫా రాజ్యంగా చేయాలని, భారత్‌లోను చేయగలమని చెప్పేవారని తెలుస్తోంది.

English summary
This continues to be the main selling point for the ISIS. The National Investigation Agency which is investigating various cases relating to the ISIS in India has found that time and again it is the same old promise that is made to prospective recruits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X