వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏంటీ దారుణం : పబ్లిక్ బస్సులోనే సెక్స్

|
Google Oneindia TeluguNews

బ్రిటన్ : కళ్యాణం వచ్చినా.. కక్కొచ్చినా.. ఆగదంటారు పెద్దలు. వీటి సంగతేమో గానీ మోహం కమ్ముకుంటే మాత్రం ఉద్రేకాన్ని ఏమాత్రం అదుపులో పెట్టుకోలేని తరహాలో తయారయ్యారు ఇప్పటి యువత. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగానే తయారైంది. ఏకంగా ఓ పబ్లిక్ బస్సులోనే ఓ ప్రేమజంట సెక్స్ కార్యకలాపాలకు తెరలేపిందంటే అక్కడి ఫాస్ట్ కల్చర్ ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక అసలు విషయానికొస్తే.. గత సోమవారం రాత్రి ఇంగ్లాండ్ లోని కార్న్ వాల్ లో పరిధిలో ఉన్న ట్రురో పట్టణంలో ఓ 20 ఏళ్ల ప్రేమజంట పబ్లిక్ బస్సులో ఎక్కారు. డబుల్ డెక్కర్ బస్సు కావడంతో.. బస్సు పైభాగంలోకి వెళ్లిపోయిన జంట.. ఉన్నట్టుండి శృంగారంలోకి దిగిపోయారు. సదరు జంట నిర్వాకానికి బస్సులో ఉన్న జనమంతా నోరెళ్లబెట్టేశారు.

Shameless couple shock Cornwall bus

పిల్లలు, పెద్దలు ఉన్నారన్న కనీస జ్ఞానం లేకుండా ఆ జంట తమ పనిలో తాము మునిగిపోవడం బస్సులో ఉన్నవారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటికీ ఓసారి డ్రైవర్ వారించే ప్రయత్నం చేసినా.. వారు మాత్రం మళ్లీ అదేమి పట్టించుకోకుండా తమ పని తాము కానిచ్చేస్తూనే ఉన్నారు. దీంతో ఇద్దరు ముగ్గురు ప్రయాణికులు డ్రైవర్ కు గట్టిగా ఫిర్యాదు చేయడంతో.. ఇక ఆ జంటను గట్టిగా మందలించి బస్సు నుంచి దించేశాడు డ్రైవర్.

'ఇంటికి వెళ్లేదాకా కూడా ఓపిక పట్టకపోతే ఎలా.. అసలు మనుషుల్లా ప్రవర్తించలేదు వారిద్దరు.. జంతువుల్లా బస్సులోనే బట్టలన్నీ విప్పేసి సెక్స్ కు పాల్పడ్డారు. ఎంత వారించినా వారిద్దరు ఎవరి మాట వినలేదు. ఇక లాభం లేక బలవంతంగా కిందకు దించేయాల్సి వచ్చింది' అంటూ బస్సులో ప్రయాణించిన ఓ మహిళ ఘటనానంతరం మీడియాతో చెప్పింది.

కాగా, ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో.. సదరు బస్సు డ్రైవర్ ను విషయం గురించి ఆరా తీశారు పోలీసులు. వారిద్దరు మత్తులో ఉన్నందువల్లే అలా ప్రవర్తించారని డ్రైవర్ పోలీసులతో వెల్లడించినట్టు సమాచారం. ఏదేమైనా ఇలా బస్సులోనే సెక్స్ చేసే స్థాయికి యువత దిగజారడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

English summary
The couple had hopped onto the 18 bus which left Truro bus station yesterday afternoon, destined for Penzance and headed to the top deck where they indulged in an intimate moment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X