వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గర్భవతని విద్యార్థిని అనుమతించని స్కూల్ యాజమాన్యం, అనైతికమేనా?

అమెరికాలోని మేరిల్యాండ్ లో గర్భవతైన ఓ విద్యార్థినిని స్నాతకోత్సవ వేడుకకు హాజరుకాకుండా నిషేధం విధించడంపై తీవ్ర నిరసన వ్యక్తమౌతోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలోని మేరిల్యాండ్ లో గర్భవతైన ఓ విద్యార్థినిని స్నాతకోత్సవ వేడుకకు హాజరుకాకుండా నిషేధం విధించడంపై తీవ్ర నిరసన వ్యక్తమౌతోంది.

ఈ విషయమై ప్రజల నుండి జాతీయ అబార్షన్ వ్యతిరేక సంఘాల నుండి ఎంత వ్యతిరేకత వ్యక్తమౌతోన్న వచ్చే వారం జరగనున్న స్నాతకోత్సవంలో ఆ విద్యార్థినిని అనుమతించరాదన్న తన నిర్ణయంపై మేరిల్యాండ్ హాజర్స్ టౌన్ లోని హెరిటేజ్ అకాడమీ వెనక్కు తగ్గలేదు.

సీనియర్ విద్యార్థిని అయిన మ్యాడీ రంక్లెస్ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా తమ పాఠశాల నిబంధనలను ఉల్లంఘించదన్నారు. అందుకే సహ విద్యార్థులతో పాటు ఆమెకు స్నాతకోత్సవ వేదికపై డిప్లోమా పట్టా అందజేయడం లేదన్నారు. ఆమె గర్భవతి అయినందుకు కాదు, కానీ, అనైతిక చర్యల్లో పాల్గొన్నందుకే ఈ నిర్ణయం తీసుకొన్నామని తల్లిదండ్రులకు స్కూల్ ప్రిన్సిపాల్ డేవిడ్ హబ్స్ లేఖ రాశాడు.

She Was Immoral: School Bars Pregnant Teen From Graduation

2009 నుండి హెరిటేజ్ అకాడమీ స్కూల్ లో 18 ఏళ్ళ రంక్లెస్ హెరిటేజ్ అకాడమీ స్కూల్ లో చదువుతోంది. గత జనవరిలో ఆమె గర్భవతి అని తేలింది. అప్పట్లో ఆమె తండ్రి స్కూల్ బోర్డు మెంబర్ గా ఉండేవాడు. మొదట ఆమెను స్కూల్ నుండి బహిష్కరిస్తామని, విద్యార్థి కౌన్సిల్ అధ్యక్షపదవి నుండి తొలగిస్తామని పాఠశాల యాజమాన్యం హెచ్చరించింది.

ఏడాదిపాటు ఇంటివద్దే ఉండి చదువుకోవాలని చెప్పింది. అయితే, తల్లిదండ్రులు వినతి మేరకు 14 మంది తోటి విద్యార్థులతో కలిసి ఆమె కూడ తరగతులకు హజరయ్యేందుకు అనుమతిఇచ్చింది.అయితే తోటి విద్యార్థుల తరహాలో ఆమె కూడ స్నాతకోత్సవ వేడుకల డిప్లొమా పట్టా అందుకోవడానికి పాఠశాల అనుమతించకపోవడాన్ని తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్ణయం సరైందికాదంటున్నారు. వారికి అమెరికాలోని హక్కుల సంఘాలు మద్దతిస్తున్నాయి.

English summary
A small Christian school in western Maryland is not backing down from its decision to ban a pregnant senior from walking at graduation next week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X