వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్యాబేజీ కొనడానికి గ్రాసరీ స్టోర్ వెళ్లి, లాటరీలో రూ.1.5 కోట్ల జాక్‌పాట్ దక్కించుకుంది

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలోని మేరీలాండ్‌లో ఓ మహిళ క్యాబేజీ కొనడానికి వెళ్తే ఆమెకు ఏకంగా 2,25,000 డాలర్ల లాటరీ తగిలింది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. ఆమె అక్షరాలు రెండు వందల ఇరవై అయిదు వేల డాలర్ల జాక్ పాట్ కొట్టేసింది.

క్యాబేజీ కొనడానికి వెళ్లింది

క్యాబేజీ కొనడానికి వెళ్లింది

ఆ మహిళ పేరు వానెస్సా వార్డ్. ఆమె తండ్రి ఇటీవల క్యాబేజీ తీసుకు రావాలని పంపించాడు. ఆమె గ్రోవటన్‌‌లోని ఓ ఫుడ్ మార్కెట్‌కు వెళ్లింది. అక్కడ ఆమె తన తండ్రి చెప్పిన క్యాబేజీ తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ సమయంలోనే అక్కడ ఆమె ఓ స్పిన్ స్క్రాచ్ టిక్కెట్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది.

టిక్కెట్ తెరవగా జాక్‌పాట్

టిక్కెట్ తెరవగా జాక్‌పాట్

ఆమె ఇంటికి వెళ్లిన తర్వాత టిక్కెట్‌ను స్క్రాచ్ చేసింది. టిక్కెట్ తెరవగానే తనకు తగిలిన జాక్‌పాట్ చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఈ గేమ్స్ టాప్ బహుమతిని గెలుచుకున్నట్లు ఆమె గుర్తించింది.

మన రూపాయల్లో రూ.1.5 కోట్లు

మన రూపాయల్లో రూ.1.5 కోట్లు

ఈ టిక్కెట్ ద్వారా లక్ష డాలర్ల నుంచి 5 లక్షల డాలర్ల వరకు ఎంతైనా గెలుచుకునే వీలు ఉంది. ఈ లాటరీలో ఆమె ఏకంగా 2,25,000 డాలర్లు గెలుచుకుంది. ఇది మన రూపాయల్లో దాదాపు రూ.1.5 కోట్లు.

గతంలో మరో మహిళకు

గతంలో మరో మహిళకు

వానెస్సా టెంపుల్ హిల్స్‌లో నివసిస్తారు. ఈ డబ్బుతో తన రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలా ప్లాన్ చేస్తానని ఆమె చెప్పారు. డిస్నీ వరల్డ్‌కు ప్లాన్ చేస్తోంది. లాటరీని దక్కించుకున్న మేరీలాండ్ వాసుల్లో వానెస్సా ఒక్కరే లేరు. గత జూలై నెలలో మరో మహిళ కూడా లాటరీలో జాక్‌పాట్ కొట్టింది.

English summary
A woman from Maryland, USA, is now the happy winner of a two hundred and twenty five thousand dollar lottery prize - all thanks to a trip to the grocery store. Vanessa Ward told Virginia Lottery that her father asked her to pick up a head of cabbage, so she stopped by the Giant Food Store in Groveton. While she was there, she decided to buy a Win a Spin scratch off ticket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X