వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

6 మాసాల కూతురిని ఇంటిపై నుండి విసిరేశాడు, ఎందుకంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

పోర్ట్‌ఎలిజబెత్:తమ ఇళ్ళను కూల్చొద్దని నిరసన వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి తన ఆరు మాసాల కూతురును ఇంటిపై నుండి కిందకు విసిరేశాడు.అయితే పోలీసులు అప్రమత్తంగా ఉండడంతో ఆ బాలికను సురక్షితంగా కాపాడారు. ఈ ఘటన దక్షిణాప్రికాలోని ఫోర్ట్‌ఎలిజబెత్ సమీపంలోని క్వాడ్ వేసి పట్టణంలో చోటు చేసుకొంది.

దక్షిణాఫ్రికాలోని పోర్ట్‌ఎలిజబెత్ సమీపంలోని క్వాడ్‌వేసి పట్టణంలోని జాయ్‌స్లోవో టౌన్‌షిప్‌లో అక్రమంగా నిర్మించిన 90 ఇళ్ళను కూల్చివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇళ్ళను కూల్చివేతను స్థానికులు అడ్డుకొన్నారు.

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లపై టైర్లు వేసి దగ్దం చేశారు. రోడ్లను బ్లాక్ చేశారు. పోలీసులకు రాళ్ళు రువ్వారు. తమ ఇళ్ళను కూల్చివేయవద్దని పలు రకాలుగా నిరసనలు వ్యక్తం చేశారు.

Shock as father throws baby off roof during stand-off with police

అయితే ఓ నిరసనకారుడు తన ఆరు మాసాల కూతురితో కలిసి తన ఇంటిపైకి చేరుకొన్నాడు. పోలీసులను వెనక్కి వెళ్ళాలని హెచ్చరించాడు. పోలీసులు వెనక్కు వెళ్ళకపోతే తన చేతిలోని ఆరు మాసాల కూతురిని కింద పారేస్తానని హెచ్చరించాడు.

పోలీసులతో నిరసనకారుడితో చర్చలు జరిపారు. కానీ, ఆ చర్చలు విఫలమయ్యాయి. దీంతో తన చేతిలోని తన కూతురిని కిందకు విసిరేశాడు. అయితే ఆ ఇంటి కిందే అప్రమత్తంగా ఉన్న పోలీసులు ఆ పాపను కిందపడకుండా తమ చేతుల్లో ఒడిసిపట్టుకొన్నారు.

దీంతో ఆ పాప సురక్షితంగా బతికి బయటపడింది. అయితే ఈ నిరసనకు దిగిన తండ్రిపై హత్యాయత్నం కేసును నమోదు చేశారు. అంతేకాదు అతడిని అరెస్ట్ చేశారు. అయితే నిరసనలో భాగంగా కూతురును విసిరేసిన ఘటనపై సోషల్ మీడియాలో తండ్రిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

English summary
A man trying to stop police from demolishing his shack has been arrested for attempted murder after hurling his six-month-old baby off the roof of their home. holding his child‚ on the roof of his shack at Joe Slovo informal settlement in Nelson Mandela Bay on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X