వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: మొబైల్‌లో తలదూర్చి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంది(వీడియో)

|
Google Oneindia TeluguNews

బీజింగ్: ఫోన్‌లో తలదూర్చారంటే కొంతమంది ప్రపంచాన్నే మరిచిపోతారు. మొబైల్ స్క్రీన్ తప్ప ఇంకేది వారికి పట్టదు. ఫోన్‌కు అంతలా అడిక్ట్ అవడం, మానసికంగాను శారీరకంగాను పెద్ద ముప్పులాగే పరిణమించింది.

ఫోన్ లోనే లీనమై ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఎంతోమంది రోడ్డు ప్రమాదాల్లో మరణించడానికి మొబైల్స్ కూడా కారణమవుతున్నాయి. తాజాగా చైనాకి చెందిన ఓ మహిళ కూడా మొబైల్ లో తలదూర్చి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.

ఓ షాపింగ్ మాల్ లో షాపింగ్ ముగించుకుని బయటకొచ్చిన మహిళ.. మొబైల్ ఫోన్ లో తలదూర్చి.. ఎక్కడికి వెళ్తున్నానో కూడా చేసుకోకుండా.. పార్కింగ్ వైపు వెళ్లింది. చైనాలో పార్కింగ్ వ్యవస్థ మన కంటే భిన్నంగా ఉంటుంది. పార్కింగ్ సెక్షన్ లోకి వెళ్లిన కార్లను అక్కడ ఉండే లిఫ్ట్ యంత్రాల ద్వారా కిందకి పంపిస్తారు.

తిరిగి మళ్లీ అదే పద్దతిలో పైకి తీసుకొస్తారు. ఆ మహిళ ఏమరపాటున పార్కింగ్ సెక్షన్ లోకి వెళ్లి.. తీరా ఎక్కడికి వచ్చానో తెలుసుకుని కంగారు పడింది. వెనక్కి వెళ్దామనుకుంటే.. అప్పటికే షట్టర్ క్లోజ్ అయిపోయింది. ఇంతలో లిఫ్ట్ ఆమెను కిందకు తీసుకెళ్లడంతో.. అప్పుడే లిఫ్ట్ మీదకు వస్తున్న ఓ కారు ఆమెను ఢీకొట్టింది.

ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.

English summary
The incident was captured by CCTV cameras filming in the parking lot in Nanjing City, China. She is now recovering from her injuries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X