వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో ఇదేమి ఫీటు.. కొండచిలువతో పోటీ పడితే కండ పీకిందిగా (వీడియో)

|
Google Oneindia TeluguNews

సిడ్నీ : ప్రముఖ వైల్ట్ లైఫ్ శాస్త్రవేత్త ఆదామ్ థార్న్ చేసిన ఫీటు ప్రమాదకరంగా మారింది. కొండ చిలువతో ఫీటు చేస్తున్న సందర్భంలో ఆయన ప్రమాదానికి గురయ్యారు. కొండ చిలువ ఒక్కసారిగా విరుచుకుపడి మోచేయి పైభాగంలోని కండ పీకేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలో బాధను పంటి బిగువున దాచుకున్న థార్న్.. చివరకు ఆ మంట తట్టుకోలేక పోయారు.

ఆస్ట్రేలియాకు చెందిన వైల్డ్ లైఫ్ శాస్త్రవేత్త ఆదామ్ థార్న్ ఫీటుకు సంబంధించిన ఈ వీడియో చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. కొండ చిలువతో చేసిన సాహసం ప్రమాదానికి దారి తీసింది. ముందు జాగ్రత్తగా ముఖానికి గ్లాస్ మాస్క్ ధరించి నిపుణుల పర్యవేక్షణలో ఈ ఫీటు చేసినప్పటికీ కొండ చిలువ దెబ్బకు థార్న్ అల్లాడిపోయారు.

shocking video python jaw on biologist adom thorn in australia

వైల్డ్ లైఫ్ జంతువుల విషయంలో అపార అనుభవం గడించిన తన మిత్రుడు రాబ్ అల్లెవా సమక్షంలో ఈ ఫీటు చేయడానికి సిద్దమయ్యారు థార్న్. ఆ క్రమంలో తన కుడిచేతిని మోచేయి వరకు మడిచి స్టంట్‌కు సిద్ధమయ్యారు. అయితే కొండ చిలువ మాత్రం వారు ఊహించని విధంగా దెబ్బ కొట్టింది. మోచేయి పైభాగంలో కండను నోట కరిచి పట్టుకోవడంతో థార్న్ షాక్‌కు గురయ్యారు.

రాబ్ అల్లెవా, ఆదామ్ థార్న్ కలిసి హిస్టరీ ఛానెల్‌లో కింగ్స్ ఆఫ్ పెయిన్ పేరిట వీడియోలు చిత్రీకరిస్తుంటారు. ఆ సిరీస్‌లో భాగంగా రకరకాల పాములు, జంతువులతో ఫీట్లు చేస్తుంటారు. ఏది కరిస్తే ఎంత బాధ ఉంటుంది.. అది ఎంత సేపు ఉంటుందనే విషయాలను ప్రజలకు తెలియజేసే విధంగా 30 పాయింట్ల స్కేలు తయారుచేసి దానిపై నమోదు చేస్తున్నారు. ఆ క్రమంలోనే కొండ చిలువతో ఇలాంటి ఫీటు చేశారు. అయితే ఇలాంటి ఫీట్లు వారికి కామన్ అయినప్పటికీ.. ఈ వీడియో చూసేవాళ్లకు మాత్రం ఒళ్లు జలదరిస్తుంది.

English summary
HISTORY’s new unscripted series “Kings of Pain” follows wildlife biologist Adam Thorn and professional animal handler Rob “Caveman” Alleva as they get bit and stung by some of the most dangerous animals and vicious stinging insects in the world – from a reticulated python to a rove beetle – to create a complete and comprehensive pain index that will ultimately help save lives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X