వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైట్‌హౌస్ వద్ద భయానకం: బుల్లెట్ల వర్షం: ప్రెస్‌మీట్‌ నుంచి అర్ధాంతరంగా ట్రంప్ వెనక్కి

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ వద్ద కలకలం చెలరేగింది. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు తుపాకుల మోత మోగించారు. బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తుపాకుల కాల్పుల శబ్దం వినిపించిన వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ రంగ ప్రవేశం చేశారు. విలేకరులతో మాట్లాడుతోన్న ట్రంప్‌ను హుటాహుటిన వెనక్కి తీసుకెళ్లారు.

Recommended Video

#Watch:వైట్‌హౌస్ వద్ద కలకలం..గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు.. ప్రెస్‌మీట్ నుంచి పరుగు తీసిన ట్రంప్!

మీడియా మొఘల్ అరెస్ట్: జాతీయ భద్రతా చట్టం ప్రయోగం: చైనా ఊహించిన దాని కంటే దుందుడుకుగామీడియా మొఘల్ అరెస్ట్: జాతీయ భద్రతా చట్టం ప్రయోగం: చైనా ఊహించిన దాని కంటే దుందుడుకుగా

అసలేం జరిగింది?

అమెరికా కాలమానం ప్రకారం.. సాయంత్రం డొనాల్డ్ ట్రంప్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి, చైనా దుందుడుకు చర్యల గురించి మాట్లాడుతున్నారు. మీడియా హాల్.. వైట్‌హౌస్‌కు ఆవరణలోనే ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్న సమయంలోనే వైట్‌హౌస్ ఆవరణకు అవతల భారీగా కాల్పుల శబ్దం వినిపించింది. ఏకధాటిగా బుల్లెట్లు కురుస్తోన్నశబ్దం మీడియా హాల్ వరకూ వినిపించింది. ఆ వెంటనే- సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ఒకరు మీడియా హాల్‌లోకి వచ్చారు. కాల్పులు జరుగుతోన్న విషయం ట్రంప్‌కు చేరవేశారు. ఆ వెంటనే ఆయనను వెనక్కి తీసుకెళ్లారు.

పెన్సిల్వేనియా అవెన్యూలో.

ఈ ఘటనకు కారణమైన గుర్తు తెలియని వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ కాల్పులు జరిపారు. అతని అప్పర్ బాడీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అతణ్ని ఇంకా గుర్తించాల్సి ఉందని తెలుస్తోంది. సరిగ్గా 5:55 నిమిషాలకు అంబులెన్స్‌ సంఘటనా స్థలానికి చేరుకుంది. ఆ గుర్తు తెలియని వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మొత్తం వైట్‌హౌస్ సమీపంలోనే ఉన్న పెన్సిల్వేనియా అవెన్యూలోని 17వ నంబర్ రోడ్‌లో చోటు చేసుకున్నట్లు వైట్‌హౌస్ సీనియర్ అధికారులు మీడియాకు వెల్లడించారు.

ప్రెస్‌మీట్ కొనసాగించిన ట్రంప్..

కొద్దిసేపటి తరువాత డొనాల్డ్ ట్రంప్ మీడియా హాల్‌కు మళ్లీ వచ్చారు. తన ప్రెస్‌మీట్‌ను కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తన వద్ద ఉన్న సమాచారం ప్రకారం..గుర్తు తెలియని వ్యక్తి ఒకరు వైట్‌హౌస్ ఫెన్సింగ్ అతి సమీపంలో కాల్పులు జరిపాడని ట్రంప్ తెలిపారు. అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతనిపై కాల్పులు జరిపినట్లు చెప్పారు. తుపాకుల శబ్దం వినిపించిన వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ తనను ఓవల్ కార్యాలయానికి తీసుకెళ్లారని చెప్పారు.

వైట్‌హౌస్ రక్షణలో లోపాలుగా

వైట్‌హౌస్ రక్షణలో లోపాలుగా

సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. అమెరికా అధ్యక్షుడి రక్షణ వ్యవహారాల్లో సీక్రెట్ సర్వీస్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని, ఈ విషయం మరోసారి రుజువైందని అన్నారు. వైట్‌హౌస్ భద్రతా వ్యవస్థలో లోపాలు ఉండటం వల్లే ఈ ఘటన సంభవించి ఉంటుందని తాను అనుకోవట్లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ ఘటనకుసంబంధించిన పూర్తి సమాచారం అందజేయాలని భద్రతాధికారులను ఆదేశించానని అన్నారు. ఈ ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని చెప్పారు.

English summary
Secret Service guards shot a person, who was apparently armed, outside the White House on Monday, President Donald Trump said just after being briefly evacuated in the middle of a press conference. The president was abruptly ushered out of the press event and black-clad secret service agents with automatic rifles rushed across the lawn north of the White House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X