వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో కాల్పుల కలకలం, మహిళను అదుపులోకి తీసుకొన్న పోలీసులు

వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ బిల్డింగ్ సమీపంలో బుదవారం కాల్పులు చోటుచేసుకొంది.ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ బిల్డింగ్ సమీపంలో బుదవారం కాల్పులు చోటుచేసుకొంది.ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

యూఎస్ బోటానిక్ గార్డెన్ కు, రేబర్న్ హౌస్ ఆఫీస్ బిల్డింగ్ కు చేరువలో అమెరికా పార్లమెంట్ భవనం ఉండే ప్రాంతంలో కాల్పులు జరగడంతో భద్రతా దళాలు వెంటనే అలర్ట్ అయి ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొన్నాయి.

firing

ఓ మహిళా అనుమానితురాలు కారులో దూసుకొస్తూ క్యాపిటల్ పోలీసుల వాహనాన్ని ఢీకొట్టింది. ఒక దశలో క్యాపిటల్ పోలీసులు కాల్పులు జరిపారని తెలుస్తోంది. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని సమాచారం.

అనుమానితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఆమె కారుతో ఢీకొట్టిన ఘటనలో కూడ ఎవరూ గాయపడలేదు. ఈ ఘటన ఎలా జరిగిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

దీని వెనుకు ఏదైనా దురుద్దేశం ఉందా అనేది ఇంకా తేలాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. క్యాపిటల్ పోలీసులకు తాము సహకారం అందిస్తున్నామని ఎప్ బీ ఐ ప్రకటించింది

English summary
Shots were fired near the US Capitol in Washington after a police car was rammed.The incident happened in an area popular with tourists outside the Rayburn building, close to the US Botanic Garden.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X