వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఇలాంటివెన్నో చూశాం', భూటాన్‌కు చైనా ఆఫర్.. భారత్‌కు చిక్కు కానీ

భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత అంశంపై విదేశాంగ సెక్రటరీ జైశంకర్ మంగళవారం నాడు స్పందించారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులను భారత్ తొలిసారి ఎదుర్కోలేదని, గతంలోను ఎదుర్కొందని చెప్పారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/బీజింగ్: భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత అంశంపై విదేశాంగ సెక్రటరీ జైశంకర్ మంగళవారం నాడు స్పందించారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులను భారత్ తొలిసారి ఎదుర్కోలేదని, గతంలోను ఎదుర్కొందని చెప్పారు.

డోక్లామ్‌లో ఉద్రిక్త పరిస్థితిని భారత్ కచ్చితంగా సమర్థవంతంగా ఎదుర్కోగలదని ఆయన చెప్పారు. తనకు ఆ విశ్వాసం ఉందని తెలిపారు. గతంలోను ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నామని చెప్పారు. ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించలేదని చెప్పడానికి ఒక్క కారణం కూడా కనిపించడం లేదన్నారు.

కాల్చుకున్నట్లే, మీరు కాదు.. మేం భయపడాలి: భారత్‌కు చైనా మీడియా హెచ్చరికకాల్చుకున్నట్లే, మీరు కాదు.. మేం భయపడాలి: భారత్‌కు చైనా మీడియా హెచ్చరిక

భారత్ - చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉంటే అది ఆసియా పైన, ప్రపంచం పైన కూడా పడుతుందని చెప్పారు. భారత్ - చైనాలు విభేదాలను వివాదాలుగా మార్చుకోకూడదని అభిప్రాయపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా అస్థిరత్వం చోటు చేసుకుంటున్న పరిస్థితుల్లో ఇండో - చైనా సంబంధాలు ఎంతో ముఖ్యమని చెప్పారు.

చైనా ఆఫర్‌కు భూటాన్ నో

చైనా ఆఫర్‌కు భూటాన్ నో

సిక్కిం సరిహద్దులోని డోక్లాం కారణంగా భారత్-చైనాల మధ్య ప్రారంభమైన గొడవ రోజురోజుకు ముదురుతున్నా భూటాన్ మాత్రం ఇప్పటి వరకు పెదవి విప్పడం లేదు. అలాగని చైనాతో రాజీకి సిద్ధపడి, భారత్‌తో సంబంధాలను తెంచుకోవడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే భారత్‌తో ఆ దేశానికి ఉన్న సంబంధాలు అలాంటవి. సమస్య పరిష్కారం కావాలంటే భారత్‌తో సంబంధాలు తెంచుకోవాలని చైనా ఇచ్చిన ఆఫర్‌ను భూటాన్‌ తిరస్కరించింది. డోక్లాంలో చైనా నుంచి ప్రమాదం ఉండడంతో భారత్‌ను భూటాన్ విడిచిపెట్టే ప్రసక్తే లేదని భూటాన్ నిపుణుడు ఒకరు చెబుతున్నారు.

ఇదీ భూటాన్ భయం

ఇదీ భూటాన్ భయం

డోక్లాం సహా వివాదాస్పద ప్రాంతాన్ని చైనా తనదిగా చెప్పుకుంటే హా, పారో, థింఫు లోయలు చైనా ఫిరంగుల లక్ష్యంలోకి వచ్చేస్తాయని చెబుతున్నారు. అంతేకాదు రాజధాని థింఫుకు దారితీసే రహదారిని చైనా ధ్వంసం చేసే ప్రమాదం ఉందంటున్నారు. ఫలితంగా భారత్‌ నుంచి ఆహార సరఫరాకు ఉన్న ఒకే ఒక మార్గం మూతపడుతుందని చెబుతున్నారు.

అదే జరిగితే భారత్‌కు ఇబ్బంది

అదే జరిగితే భారత్‌కు ఇబ్బంది

తూర్పు భూటాన్‌లోని 495 చ. కి.మీ., పశ్చిమ సెక్టార్‌లోని 286 చ.కి.మీ. తమవేనని చైనా వాదిస్తోంది. అయితే డోక్లాంను కనుక తమకు ఇచ్చేస్తే తూర్పు భూటాన్‌ను వదులుకోవడానికి తాము సిద్ధమని చైనా ఆఫర్ ఇచ్చింది. అదే జరిగితే చైనాకు భారత్‌పై ఆధిపత్యం చలాయించే అవకాశం లభిస్తుంది.

కానీ భూటాన్ ససేమీరా

కానీ భూటాన్ ససేమీరా

అయితే చైనా ఆఫర్‌ను భూటాన్ అంగీకరించేందుకు సిద్ధంగా లేదు. ఒకవేళ డోక్లాంను కనుక చైనాకు అప్పగిస్తే ఆ దేశ దళాలు భూటాన్‌లోని మరో ప్రాంతంలోకి చొరబడతాయని భూటాన్ భావిస్తోంది. ఇది మరింత ప్రమాదకరం కావడంతో భారత్‌తో ఉండేందుకే భూటాన్ సిద్ధపడుతోంది.

English summary
India has handled border issues in past, not the first time, says Jaishankar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X