వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ గెలుపు: సిలికాన్ వ్యాలీలో నిస్తేజం, దేశంగా విడిపోతామని కాలిఫోర్నియా గ్రూప్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు పలువురికి రుచించడం లేదు. ఐటీకి అనుకూలమైన నిర్ణయాలు ఉండవేమోనని సిలికాన్ వ్యాలీ ఆందోళన చెందుతోంది. మరోవైపు ట్రంప్ గెలిచినందున తాము అమెరికా నుంచి విడిపోతామని కాలిఫోర్నియా గ్రూపు చెబుతున్నట్లుగా సామాజిక అనుసంధాన వేదికలో ప్రచారం జరుగుతోంది. టెక్సాస్‌లో కూడా అదే గళం వినిపిస్తోందట.

ఐటీ పరిశ్రమలకు సిలికాన్ వ్యాలీ ప్రధాన కేంద్రం. అక్కడ ట్రంప్ గెలుపు తర్వాత నిస్తేజం కనిపిస్తోందట. ఇక్కడి ఒక్కో పరిశ్రమకు చెందిన ప్రతినిధులు ఒక్కో విధంగా స్పందించారు. ఇది తన జీవితంలో జరిగిన చెడు సంఘటనగా అని ఒకరు అంటే, హిట్లర్ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలు ఇలాగే అనుకున్నారా అని మరొకరు సోషల్ మీడియాలో పేర్కొన్నారట.

గెలవగానే షాకిచ్చిన ట్రంప్, జర్నలిస్ట్‌లు అడగటంతో యూ టర్న్!గెలవగానే షాకిచ్చిన ట్రంప్, జర్నలిస్ట్‌లు అడగటంతో యూ టర్న్!

హైపర్‌లూప్‌ ఒన్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు.. కాలిఫోర్నియా రాష్ట్రం అమెరికా నుంచి విడిపోతే మంచిదని వ్యాఖ్యానించారట. ఐటీ పరిశ్రమ హిల్లరీ క్లింటన్‌కు అనుకూలంగా వ్యవహరించింది. విరాళాలు హిల్లరీకే ఎక్కువ ఇచ్చింది. ట్రంప్ విధానాలను ఫేస్‌బుక్‌ సీఈవో జుకెర్ బర్గ్‌ తప్పుపట్టారు. కొన్ని సంస్థలు ట్రంప్‌కు వ్యతిరేకంగా పని చేశాయి. హిల్లరీనే గెలుస్తారని పరిశ్రమ భావించింది.

donald trump

మరోవైపు, కాలిఫోర్నియాలో హిల్లరీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ట్రంప్ ఎన్నికతో మరోసారి వేర్పాటువాదం తెరపైకి వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. కొందరు అయితే అమెరికా నుంచి విడిపోవాలని కోరుకంటున్నారు. ఎస్ కాలిఫోర్నియా అనే బృందం ఇప్పటికే ఈ మేరకు శాక్రిమెంటోలో బుధవారం ఓ కార్యక్రమం నిర్వహించింది.

ఒబామానే చివరి ప్రెసిడెంట్: బాబా వంగా జోస్యం, ట్రంప్ వర్గం ఆందోళన, ఏం జరిగేనో? ఒబామానే చివరి ప్రెసిడెంట్: బాబా వంగా జోస్యం, ట్రంప్ వర్గం ఆందోళన, ఏం జరిగేనో?

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవడాన్ని బ్రెగ్జిట్ అన్నట్లుగానే తమ రాష్ట్రం విడిపోవడాన్ని కాల్ ఎగ్జిట్‌గా వారు వ్యవహరిస్తున్నారు. 2020 నాటికల్ల అమెరికా నుంచి కాలిఫోర్నియా విడిపోయి దేశంగా ఆవిర్భవించేలా చేయడమే వారి లక్ష్యం.

English summary
Silicon Valley critics cautiously open their arms to Donald Trump.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X