వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ‌ణికిస్తోన్న వింత వ్యాధి: తొలి కేసు న‌మోదు!

|
Google Oneindia TeluguNews

సింగ‌పూర్ సిటీ: చాన్నాళ్ల పాటు ఆఫ్రికా దేశాల‌కు మాత్ర‌మే ప‌రిమితమైపోయిందనుకుంటున్న వింత వ్యాధి మంకీపాక్స్‌. ఈ వ్యాధి ఇత‌ర దేశాలకు విస్త‌రిస్తోంది. క్ర‌మంగా కోర‌లు చాస్తోంది. తాజాగా సింగ‌పూర్‌లో ఈ వ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. దీనితో ఆ దేశంలో క‌ల‌క‌లం పుట్టుకొచ్చింది. వైద్య‌ప‌ర‌మైన అత్య‌వ‌స‌ర ఆదేశాలను జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌మాద‌క‌ర‌మైన‌, అత్యంత అరుదుగా చెప్పుకొనే మంకీపాక్స్ కేసులు సింగ‌పూర్‌లో న‌మోదు కావ‌డం ప‌ట్ల అక్క‌డి ప్ర‌భుత్ం అప్ర‌మ‌త్త‌మైంది. అన్ని ఆసుప‌త్రుల‌కు నిర్దుష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది.

నైజీరియా నుంచి సింగ‌పూర్‌కు వ‌చ్చిన ఓ వ్య‌క్తికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. మంకీపాక్స్ ల‌క్ష‌ణాలు క‌నిపించిన‌ట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ వెల్ల‌డించింది. మంకీపాక్స్ ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే అత‌ణ్ణి నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ఇన్ఫెక్ష‌న్ డిసీజెస్‌కు త‌ర‌లించామ‌ని, అత్య‌వ‌స‌ర విధానం కింద అత‌నికి చికిత్స అందిస్తున్నామ‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం ఆ వ్య‌క్తి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని వెల్ల‌డించింది.

Singapore confirms case of monkeypox

మ‌ధ్య, ప‌శ్చిమాఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ వ్యాధిగ్ర‌స్తులు చాలామంది ఉన్నారు. కొన్నాళ్ల నుంచీ ఈ వ్యాధి పొరుగు దేశాల‌కు వ్యాప్తి చెంద‌లేదు. జంతువుల నుంచి మ‌నుషుల‌కు సోకే ల‌క్ష‌ణం దీనికి ఉంది. వ్యాధుల బారిన ప‌డిన జంతువులు, ఎలుక‌ల నుంచి మంకీపాక్స్ మ‌నుషుల‌కు సోకుతుంద‌ని డాక్ట‌ర్లు నిర్ధారించారు. అనారోగ్యానికి గురైన కొన్ని ర‌కాల వేట‌మాంసాన్ని తిన‌డం వ‌ల్ల కూడా ఇది వ్యాపిస్తుంద‌ని చెప్పారు. అత్యంత స‌మీపంలో ఉంటే- మ‌నుషుల నుంచి మ‌నుషుల‌కూ సోకుతుంద‌ని చెబుతున్నారు. జ్వ‌రం రావ‌డం, చ‌ర్మంపై బుడిపెల్లాంటివి ఏర్ప‌డ‌టం, దుర‌ద వంటివి ఈ వ్యాధి ల‌క్ష‌ణాలు. దీనివ‌ల్ల న్యుమోనియా వస్తుందని, ప్రాణాలు పోవడానికి కారణమౌతుందని డాక్టర్లు ధృవీక‌రించారు.

సింగ‌పూర్‌లో స్థిర‌ప‌డిన నైజీరియాకు 38 సంవ‌త్స‌రాల వ్య‌క్తి.. ఇటీవ‌లే స్వ‌దేశానికి వెళ్లాడ‌ని, అక్క‌డ వేట‌మాంసాన్ని భుజించాడ‌ని త‌మ విచార‌ణ‌లో తేలిన‌ట్లు ఆరోగ్య‌మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. దాని ప్రభావం వ‌ల్లే అత‌నికి మంకీపాక్స్ సోకి ఉంటుంద‌ని నిర్ధారించిన‌ట్లు చెప్పారు. వ్యాధి పూర్తిగా న‌యం అయ్యేంత వ‌ర‌కూ అత‌ణ్ణి ఇంటికి పంపించ‌బోమ‌ని అన్నారు. పూర్తిగా న‌యం కాకుండానే ఇంటికి పంపించ‌డం వ‌ల్ల మంకీపాక్స్ ఇత‌రుల‌కు సోకే ప్ర‌మాదం ఉంద‌ని చెప్పారు.

<br>సెక్సీ కామెంట్స్‌: క‌న్నీరు పెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్య‌ర్థిని
సెక్సీ కామెంట్స్‌: క‌న్నీరు పెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్య‌ర్థిని

English summary
A case of imported monkeypox infection has been confirmed in Singapore. The patient is a 38-year-old Nigerian who arrived on Apr 28 and tested positive for the virus on May 8, said the Ministry of Health (MOH) in a media release on Thursday. He is in stable condition in an isolation ward at the National Centre for Infectious Diseases (NCID), the ministry added. Monkeypox is a rare disease caused by a virus that is transmitted to humans from animals mainly in central and western Africa. This happens when a person comes in close contact with infected animals such as rodents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X