• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హాలీవుడ్ మూవీ ట్రయలర్‌లా, ఇదీ మీ భవిష్యత్తు: కిమ్‌ను వీడియోతో పడగొట్టిన ట్రంప్(వీడియో )

By Srinivas
|

సింగపూర్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షులు కింగ్ జాంగ్ ఉన్‌లు మంగళవారం సింగపూర్‌లో భేటీ కావడం చారిత్రాత్మకం. ఈ భేటీ సానుకూలమని ఇరువురు నేతలు చెప్పారు. అణ్వాయుధాలను వదిలేసేందుకు అంగీకరిస్తే భవిష్యత్తులో ఉత్తర కొరియా ఇలా ఉంటుందంటూ ట్రంప్.. కిమ్‌కు దాదాపు నాలుగు నిమిషాల వీడియో చూపించారట. 'టూ మెన్, టూ లీడర్స్, వన్ డెస్టినీ (గమ్యం)' అంటూ వీడియో వివరించింది.

ట్రంప్‌ను మించి!: రన్నింగ్ బాడీగార్డ్స్ నుంచి.. కిమ్ భద్రతా వలయం, నోరు వెళ్లబెట్టాల్సిందే

ఈ వీడియోను తన ఐపాడ్‌లో చూపించారు. ఈ వీడియోను చూపిన అనంతరం ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందిన భవిష్యత్‌ కోసం సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని ట్రంప్‌.. కిమ్‌ను కోరారని తెలుస్తోంది. సాంకేతికతలో దూసుకుపోతున్న చైనా, దక్షిణ కొరియాల మధ్యలో ఉన్న ఉత్తర కొరియా అతి తర్వగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇది కిమ్‌ను బాగా ఆకర్షించిందట.

Singapore summit: the video Trump showed to Kim promising a future of skyscrapers, dodgems and pineapple

ఆ వీడియోలో ఉత్తర కొరియాలో పెద్ద పెద్ద భవనాలు, అంతరిక్షంతో సహా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ అద్భుత దేశంగా అవతరిస్తుందని చూపించారు. ఇది ఒక హాలీవుడ్ స్టయిల్ సినిమాను తలపించింది. హాలీవుడ్ స్టయిల్ వాయిస్ ఓవర్‌తో వీడియోను చూపించారు.

కాగా, సింగపూర్‌లో కిమ్‌-ట్రంప్‌ వర్కింగ్‌ లంచ్‌ ఇరుదేశాధినేతల అభిరుచులను తెలిపింది. షడ్రసోపేతమైన భోజనాన్ని ఏర్పాటు చేశారు. వీరి కోసం ఏర్పాటు చేసిన సిక్స్‌ కోర్స్‌ మీల్‌లో మూడు డిజర్ట్స్‌ కూడా ఉన్నాయి. ఈ భోజనంలో హేగన్‌ డాజ్స్‌ వెనిల్లా ఐస్‌క్రీమ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇరు దేశాల నేతలు డైట్‌ను పక్కన పెట్టి విందును ఆస్వాదించారు.

ఇరుదేశాల నేతలకు సంప్రదాయ రొయ్యల కాక్‌టెయిల్‌తోపాటు అవకాడో సలాడ్‌, పచ్చి మామిడితో చేసిన కెర్బూ, మలేషియాకు చెందిన రైస్‌ వంటకం, తేనె, నిమ్మకాయలతో అలంకరించిన ఆక్టోపస్‌లతోపాటు కొరియన్‌ స్టఫ్ఫ్‌డ్ కూకుంబర్‌, గొర్రె మాంసంతోపాటు, బ్రకొలీ, రెడ్‌వైన్‌, స్వీట్‌ అండ్ సోర్‌ క్రిస్పీ పోర్క్‌, యంజూహు ఫ్రైడ్‌ రైస్‌, కాడ్‌ఫిష్‌-రాడిష్‌లు ఉన్నాయి. ఇక డిజర్ట్‌ల్లో డార్క్‌ చాక్లెట్‌ టార్టల్‌ గ్రెంచి, చెర్రీలతో అలంకరించిన హేగన్‌ డాజ్స్‌ వెనిల్లా ఐస్‌క్రీమ్‌, ట్రోపిజెన్నీ అనే ఫ్రంచి పేస్ట్రీ ఉన్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Among the many tactics President Donald Trump rolled out in his summit with North Korean leader Kim Jong Un in Singapore was apparently a four-minute video, styled like a movie trailer, that casts Trump and Kim as the heroes of a story about “two men, two leaders, one destiny.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more