వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిల్లలను కనే విషయం వాయిదా వేయద్దు.. ఆర్థిక సాయం అందజేస్తాం..? ప్రభుత్వం

|
Google Oneindia TeluguNews

కరోనా వల్ల వ్యవస్థలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఇప్పట్లో కోలుకునేలా లేవు. దీంతో జంటలు పిల్లలను కనే విషయాన్ని పక్కనపెట్టేశారు. ఈ విషయం సింగపూర్ ప్రభుత్వానికి తెలిసింది. అలా చేయొద్దు నాయనో అంటూ మొత్తుకుంటోంది. మీకు కావాల్సిన ఆర్థిక సాయం చేస్తాం కానీ.. అలాంటి నిర్ణయాలు తీసుకొవద్దని చెబుతోంది.

కరోనా వల్ల చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇక యువ జంటల పరిస్థితి చెప్పక్కర్లేదు. దీంతో వారు పరిస్థితి బాగావడంపై మాత్రం ఫోకస్ చేశారు. అప్పటివరకు పిల్లలను కనబోము అని వాయిదా వేస్తున్నారు. సింగపూర్ ప్రజలు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రభుత్వానికి తెలిసింది. పిల్లలను కనాలని అనుకుంటున్న జంటలకు ఆర్థిక సాయం అందివ్వాలని నిర్ణయం తీసుకున్నది.

singapore to pay would be parents for babies..

పిల్లల పోషణ, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్కెక్కించేందుకు సింగపూర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పిల్లలను కనాలనే నిర్ణయాన్ని యువ జంటలు వాయిదా వేసుకన్నట్టు తెలిసిందని.. దానిని వెనక్కి తీసుకునేందుకు వీలుగా ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించామని సింగపూర్ ఉపప్రధాన మంత్రి హెంగ్ స్వీ కీట్ తెలిపారు. ఒకేసారి మాత్రమే సహాయం చేస్తామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

అయితే ప్రభుత్వ నిర్ణయంతో యువ జంటలకు మేలు జరుగుతుంది. ఆర్థిక సాయం ఇస్తున్నందున పిల్లలను కనే అంశాన్ని వాయిదాపెట్టే అవకాశం ఉండదు. మరోవైపు సింగపూర్ కూడా అభివృద్ది చెందిన దేశం. అక్కడ జనాభా కూడా తక్కువే.. ఈ క్రమంలో వారు పిల్లలను కనే విషయం వాయిదా పెట్టడం కాస్త.. ఇబ్బందిగా మారుతోంది. దీంతో ప్రభుత్వం స్పందించింది. దీనిని పలువురు కపుల్స్ స్వాగతించారు.

English summary
singapore to pay would be parents for babies to ease virus hit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X