వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాట్‌ నెక్ట్స్ : ఎన్నికల్లో గెలిచారు..కానీ మ్యాజిక్ ఫిగర్ రాలేదు, జస్టిన్ ట్రూడో పరిస్థితేంటి..?

|
Google Oneindia TeluguNews

టొరంటో: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రెండో సారి గెలిచారు. ఆ దేశానికి జరిగిన ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచిన ట్రూడో లిబరల్ పార్టీ... ప్రభుత్వం ఏర్పాటుకు మాత్రం కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరుకోలేకపోయింది. దీంతో కెనడా రాజకీయాల్లో ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకుంటాయా అని ఇటు ప్రపంచదేశాలతో పాటు అటు కెనడా దేశస్తులు కూడా చాలా దగ్గరగా పరిస్థితిని గమనిస్తున్నారు.

 సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ట్రూడో పార్టీ అవతరణ

సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ట్రూడో పార్టీ అవతరణ

కెనడాలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా లిబరల్ పార్టీ అవతరించింది. కెనడాలో 338 పార్లమెంటు స్థానాలు ఉండగా ఒక పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 170. అయితే ఆదేశ ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ 156 స్థానాలు గెలుచుకున్న అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మరో 14 సీట్ల దూరంలో నిలిచిపోయింది. ప్రస్తుతం ట్రూడో రాజకీయ చక్రం ఎలా తిప్పుతారా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా ట్రూడో ఇతర పార్టీల సహకారం కోరాల్సిందే.

లిబరల్ పార్టీ కంటే కన్జర్వేటివ్ పార్టీకే ఓటు షేరు ఎక్కువ

లిబరల్ పార్టీ కంటే కన్జర్వేటివ్ పార్టీకే ఓటు షేరు ఎక్కువ

ఇదిలా ఉంటే కన్జర్వేటివ్ పార్టీ 121 స్థానాలు గెలిచింది. 2015లో ఈ పార్టీ 99 స్థానాలకే పరిమితమైంది. అంతేకాదు లిబరల్ పార్టీకంటే మెరుగైన ఓటుశాతం కన్జర్వేటివ్ పార్టీకి దక్కింది. లిబరల్ పార్టీకి 33.1 శాతం ఓట్లు రాగా కన్జర్వేటివ్ పార్టీకి 34.4 శాతం ఓటు షేరు లభించింది. దీంతో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. లిబరల్ పార్టీ ప్రభుత్వం ఒకవేళ పడిపోతే కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉంటుందని కన్జర్వేటివ్ పార్టీ నేత ఆండ్రూ స్కీర్ తెలిపారు.

వాట్ నెక్ట్స్..?

వాట్ నెక్ట్స్..?

రానున్న వారాల్లో జస్టిన్ ట్రూడో కొత్త కేబినెట్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ ఎన్నికల్లో పలువురు కేబినెట్ మంత్రులు ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత గవర్నర్ జనరల్‌ను కలిసి పార్లమెంట్ రీకాల్ కోసం ఓ తేదీని నిర్ణయించాలని కోరుతారు. అంతకుముందు స్పీచ్ ఫ్రమ్ ది థ్రోన్ పేరుతో కొత్త పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి. ఆ సమయంలో గవర్నర్ జనరల్ ప్రభుత్వ విధివిధానాలను చదువుతారు. దీనిపై పార్లమెంటులో సభ్యులు చర్చ జరిపి ఓటింగ్‌కు వెళతారు. ఈ ప్రసంగం పాస్ చేసేందుకు 170 మంది సభ్యుల మద్దతు అవసరం. దీంతో న్యూడెమొక్రటిక్ పార్టీ ఇక్కడ కీలకం కానుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అనలిస్టులు.

సింగ్ ఈజ్ కింగ్

సింగ్ ఈజ్ కింగ్

నేషనల్ డెమొక్రటిక్ పార్టీ సిద్ధాంతాలు లిబరల్ పార్టీ సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఎన్డీపీ లిబరల్ పార్టీకి మద్దతు తెలిపే అవకాశం ఉందని అనలిస్టులు చెబుతున్నారు. ఎన్డీపీ 24 సీట్లు గెలిచింది. వీరి మద్దతుతో గవర్నర్ జనరల్ ప్రసంగాన్ని లిబరల్ పార్టీ పాస్ చేయిస్తుంది. అయితే లిబరల్ పార్టీతో కలిసి తాను పనిచేసేందుకు సిద్ధమని జగ్మీత్ సింగ్ ఎన్నికలకు ముందే ప్రకటించారు. జస్టిన్ ట్రూడో మద్దతు కోసం పాకులాడాల్సిన అవసరం లేదని గవర్నర్ ప్రసంగంలో ఎన్డీపీని మెప్పించే అంశాలు పొందుపరిస్తే చాలని ఆటోమేటిగ్గా ఎన్డీపీ మద్దతు పలుకుతుందని కెనడా పార్లమెంటరీ వ్యవస్థపై పట్టున్న ఫిలిప్ లగస్సే తెలిపారు. 2015లో ఎన్డీపీ 44 సీట్లలో విజయం సాధించగా 2019లో మాత్రం 24 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.

గవర్నర్ ప్రసంగంలో ఎన్డీపీకి అనుకూల అంశాలు

గవర్నర్ ప్రసంగంలో ఎన్డీపీకి అనుకూల అంశాలు

ఇక గవర్నర్ ప్రసంగంలో ఎన్డీపీ అంగీకరించే అంశాలే ఉంటాయని యూనివర్శిటీ ఆఫ్ టొరంటో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఎమిరిటస్ పీటర్ రసెల్ చెబుతున్నారు. ఉదాహరణకు నేషనల్ ఫార్మాకేర్ ప్లాన్‌, ఎన్నికల సంస్కరణలు వంటివి పొందుపరుస్తారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అయితే ఎన్డీపీ మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా ఎప్పటికీ ఎన్డీపీ తమతోనే ఉంటుందని బలంగా చెప్పలేమని కూడా నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ముందుజాగ్రత్త చర్యలు జస్టిన్ ట్రూడో తీసుకుంటే మంచిదని వారు సూచిస్తున్నారు. వాతావరణ మార్పుల విధానం తీసుకురావాల్సిందిగా ఎన్డీపీ లిబరల్ పార్టీపై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ట్రాన్స్ మౌంటెన్ పైప్‌లైన్ విస్తరణకు కన్జర్వేటివ్స్ పట్టుబట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే దీనికి ఎన్డీపీ వ్యతిరేకంగా ఉంది.

ఏది ఏమైనప్పటికీ స్థిరమైన ప్రభుత్వ ఒకటి రెండేళ్ల వరకు ఉంటుందని ఆ తర్వాత విపక్షాలు చొరవ తీసుకుని మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Canadian Prime Minister Justin Trudeau won a second term on Monday, but he lost his majority in Canada's parliament. Now Canadians are watching closely to see what he'll do next.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X