వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తర కొరియా నెంబర్ 2 ప్లేస్ ఎవరిదీ ? కిమ్ విశ్వసించేది ఈమేనేనా ..?

|
Google Oneindia TeluguNews

ప్యోంగ్యాంగ్ : ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తర్వాతి స్థానం ఎవరిదీ ? అంటే ఠక్కున చెప్పడం కష్టమే. ఎందుకంటే నియంత అయిన కిమ్ .. ఎవరినీ అంతగా విశ్వసించరు. అధ్యక్ష పదవీతోపాటు కీలక పదవులు తన వద్దే ఉంచుకున్నారు. అయితే ఇటీవల ఆయన వైఖరిలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. తన ఇద్దరు సోదరులు అధ్యక్ష పదవీ రేసు నుంచి తప్పించిన కిమ్ .. తన చెల్లెకు మాత్రం దేశంలో రెండో స్థానం కల్పిస్తుండటం విశేషం.

కీ రోల్
కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్ (30) ఉత్తర కొరియా రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తున్నారు. ఇటీవలే ఆమెను అధికార పార్టీ వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియాకు సంబంధించి ప్రొపగండ, అజిటేన్ విభాగానికి డైరెక్టర్‌గా నియమించారు కిమ్. దీంతోపాటు పొలిటికల్ బ్యూరో సభ్యురాలిగా కూడా కొనసాగుతున్నారు యో జాంగ్. పార్టీలో కీలక నిర్ణయం తీసుకునే అత్యున్నత విభాగంలో చోటు లభించడం అంతా ఆశామాషీ కాదు. పొలిటికల్ బ్యూరో సభ్యురాలిగా యో జాంగ్‌కు చోటు కల్పించి .. తన తర్వాత స్థానం యో జాంగ్‌దేనని సంకేతాలిచ్చారు కిమ్. దీనిని దక్షిణ కొరియా నిఘా విభాగం మీడియాకు తెలియజేసింది.

Sister of N. Korean leader promoted to #2 position, says S. Korean spy agency

పెరిగిన ప్రయారిటీ ..
ఇటీవల దేశరాజధాని ప్యోంగ్యాంగ్‌లో జరిగిన సమావేశానికి కూడా యో జాంగ్ హాజరయ్యారు. అయితే ఆ సమావేశంలో తమ పార్టీ వైస్ చైర్మన్ కిమ్ యాంగ్ చోల్ పక్క స్థానంలో ఆశీనులవడం విశేషం. ఈ సమావేశానికి సంబంధించినన దృశ్యాలు మీడియాలో ప్రసారమవడంతో .. జాంగ్ నెంబర్ టూ ప్లేస్ కొనసాగుతున్నారని అర్థమవుతుంది. అంతేకాదు ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ .. ఉత్తర కొరియా విచ్చిసినప్పుడు కూడా కిమ్‌తోపాటు జాంగ్‌కు కూడా సముచిత స్థానం కల్పించారు అధికారులు. ఇదే విషయాన్ని దక్షిణ కొరియా జాతీయ నిఘా విభాగం కమిటీ చైర్మన్ లీ హైహున్ మీడియాకు వివరించారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి .. కిమ్ తన తర్వాత స్థానాన్ని జాంగ్‌కు ఇస్తున్నారని స్పష్టమైందని తెలిపారు. అదే సందర్భంలో ఉత్తర కొరియా మహిళా ఉన్నతాధికారుల్లో ఒకరైన కిమ్ సాంగ్ హైను క్రమంగా తగ్గిస్తున్నారని గుర్తుచేశారు.

English summary
the younger sister of North Korea’s Supreme Leader Kim Jong-un appears to have been promoted to the number two position in the country’s ruling apparatus, according to a South Korean intelligence assessment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X