వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్‌పోర్ట్ దగ్గర జంట పేలుళ్లు: 6గురు మృతి

|
Google Oneindia TeluguNews

అడెన్: మరోసారి విమానాశ్రయమే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈసారి యెమెన్‌లోని అడెన్ విమానాశ్రయానికి సమీపంలో రెండు కారుబాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్ర గాయాలపాలయ్యారు.

ఈ ఘటనలో ఒక కారు మిలటరీ క్యాంపు బేస్ వద్ద పేల్చగా.. మరో కారును క్యాంపు లోపలికి తీసుకెళ్లాక పేల్చారు. అయితే, అక్కడే ఉన్న మిలటరీ స్థావరం, ఎయిర్ పోర్ట్‌ లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది.

Six killed in double car bomb attack in Aden

చనిపోయిన వాళ్లంతా మిలటరీ చెందిన వారే. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడిందనే విషయం ఇంకా తెలియరాలేదు.

గత కొంతకాలంగా ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద ఇలాంటి దాడులు చేస్తున్న నేపథ్యంలో తాజాగా యెమెన్ దాడి కూడా వారి పనే అని అధికారులు అనుమానిస్తున్నారు.

English summary
At least six people were killed in a double car bomb attack on Wednesday targeting a military base adjoining Aden international airport in southern Yemen, according to a military source who blamed jihadists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X