వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గొడ్డళ్లతో వచ్చినా బెదరలేదు: భారత సంతతి చిన్నారి సాహసం(వీడియో)

|
Google Oneindia TeluguNews

వెల్లింగ్టన్‌: భారత సంతతికి చెందిన ఆ చిన్నారికి ఆరేళ్లే. అయినా ఆమె చూపిన ధైర్య సాహాసాలు మాత్రం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్నాయి. గొడ్డలితో దొంగతనానికి వచ్చిన దుండగుడిని చూసి కూడా ఏమాత్రం బెదరకుండా.. మరో వ్యక్తిపై దాడి చేస్తున్న అతడ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిందా చిన్నారి. కాగా, ఈ ఘటన షాపులోని సీసీటీవీలో రికార్డైంది. ఇప్పుడు ఆ ఫుటేజీ వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో భారత సంతతికి చెందిన సుహైల్‌ పటేల్‌ అనే వ్యక్తికి ఎలక్ట్రానిక్‌ షోరూం ఉంది. సోమవారం షోరూం దోపిడీ దొంగలు చొరబడి బీభత్స సృష్టించారు. ఆ సమయంలో షాపులో ఉన్న సుహైల్‌ కూతురు ఆరేళ్ల సారా పటేల్‌ ఏమాత్రం బెదరకుండా తన తండ్రి షాపులో పనిచేసే వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేసింది.

Six-year-old girl tries to stop axe-wielding robber, shop CCTV shows

దోపిడీదారుల చేతుల్లో ఆయుధాలు ఉండటంతో తండ్రి సారా చెయ్యి పట్టుకుని సురక్షితంగా ఉంచేందుకు గబగబా తీసుకెళుతుండగాగా.. షాపులో పనిచేసే వ్యక్తిపై ఓ దుండుగుడు గొడ్డలి పెట్టడంతో సారా ఏమాత్రం భయపడకుండా పరిగెత్తుకెళ్లి వాడిని పక్కకు నెట్టబోయింది.

మళ్లీ వెంటనే వెనక్కి వచ్చేసింది. అయితే అలాంటి పరిస్థితిలో కూడా ఓ వ్యక్తిని కాపాడాలనే ఉద్దేశంతో సారా ముందుకెళ్లడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆమె ధైర్యాన్ని అంతా ముచ్చటపడుతున్నారు. సారా సాధారణంగా కూడా అందరికీ సహాయం చేస్తూ ఉంటుందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు.

కాగా, దుండగులను చూసి తాను భయపడలేదని సారా చెప్పడం గమనార్హం. అయితే దొంగతనం ఘటనతో సారా బాగా షాక్‌కు గురైందని తండ్రి తెలిపారు. దొంగలను వెంబడించిన సుహైల్ పటేల్.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఐదుగురు టీనేజీ వయసులో ఉన్న దుండగులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు కూడా సారాను అభినందించారు.

English summary
Little Sarah Patel, who is only 6, stood up to an axe-wielding robber when invaders allegedly stormed her family's North Shore shop on Monday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X