వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

#SmallBusinessSaturday: వాషింగ్టన్ వీధుల్లో కమలా హ్యారిస్ షాపింగ్: భర్తతో కలిసి

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కొంతకాలంగా స్మాల్ బిజినెస్ శాటర్ డే క్యాంపెయిన్ నడుస్తోంది. వీధి వ్యాపారస్తులు, చిరు వర్తకులను ప్రోత్సహించడానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి చేపట్టిన ఓ చిన్న సైజు ఉద్యమం ఇది. #SmallBusinessSaturdayగా గుర్తింపు పొందింది. మన వద్ద ధన త్రయోదశితో దీన్ని పోల్చుకోవచ్చు. అమెరికాలో కొన్ని ప్రత్యేక రోజుల్లో చేపట్టే క్యంపెయిన్. చిరు వ్యాపారుల వద్ద పెద్ద మొత్తంలో దుస్తులు, వస్తువులను కొనుగోలు చేయడం, వాటిని లేని వారికి దానం చేయడం ఈ అకేషన్‌కు ఉన్న ప్రత్యేకత.

జో బిడెన్ విషెస్..

ఈ నెల 28వ తేదీన స్మాల్ బిజినెస్ శాటర్ డే అమెరికాలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్.. చిరు వ్యాపారస్తులకు విషెస్ తెలిపారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థకు చిరు వ్యాపారస్తులు వెన్నెముకగా నిలిచారని ప్రశంసించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వీధి వ్యాపారలు, చిరు వర్తకులను మరింత ప్రోత్సహించాల్సిన, ఆర్థికంగా చేయూతను ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు.

శాటర్ డే

ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనడానికి సమష్టిగా పోరాడుతున్నామని భరోసా ఇచ్చారు. ఇదివరకు తాను ఓ షాప్‌ను సందర్శించిన ఫొటోను తన ట్వీట్‌కు జత చేశారు. స్మాల్ బిజినెస్ శాటర్ డే వంటి కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే కాకుండా.. ప్రతి రోజూ వారి వద్ద వస్తువులు లేదా దుస్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతి అమెరికన్.. దీన్ని తమ బాధ్యతగా గుర్తించాలని సూచించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కొత్త ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్.. అధ్యక్షుడి కంటే ఓ అడుగు ముందుకేశారు. ట్వీట్టర్‌కే పరిమితం కాలేదామె.

హాలిడే మార్కెట్‌లో కమలా హ్యారిస్..

రాజధాని వాషింగ్టన్ వీధుల్లో తన భర్త డౌగ్ ఎంహాఫ్‌తో కలిసి కలియ తిరిగారు. అవుట్ డోర్ హాలిడే మార్కెట్‌లో దుస్తులను కొనుగోలు చేశారు. టీషర్టులను కొన్నారు. ఆ టీషర్టులపై Madam Vice President అనే అక్షరాలు ముద్రించి ఉన్నాయి. వాషింగ్టన్‌లోని గ్యాలరీ ప్లేస్ వద్ద ఉన్న ఈ హాలిడే మార్కెట్‌లో సుమారు 25 నిమిషాల పాటు హాలిడే మార్కెట్‌లో గడిపారు. కొన్ని పజిల్స్, ఛీస్, టీ పౌడర్‌ను కమలా హ్యారిస్ దంపతులు కొనుగోలు చేసినట్లు డబ్ల్యూటీఓపీ న్యూస్ స్టేషన్‌ను ఉటంకిస్తూ న్యూయార్క్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది.

సజావుగా అధికార మార్పిడి..

సజావుగా అధికార మార్పిడి..

కరోనా వైరస్ వల్ల చిరు వ్యాపారస్తులు ఆర్థికంగా ఒడిదుడుకులకు గురవుతున్నారని, వారిని ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనికి అవసరమైన చర్యలను కొత్త అధ్యక్షుడు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అధికార మార్పిడిపై జో బిడెన్.. న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నారని పేర్కొన్నారు. అధికార మార్పిడి సజావుగా సాగుతుందని తాను భావిస్తున్నానని, ఎలాంటి ఇబ్బందికర వాతావరణం ఉండబోదని చెప్పారు. తమకు సంపూర్ణ మెజారిటీ లభించిందని, రిపబ్లికన్లకు న్యాయపరంగా కూడా ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు.

English summary
On the occasion of #SmallBusinessSaturday, Vice President-elect Kamala Harris hit up a Washington, DC outdoor holiday market Saturday and found herself the perfect stocking stuffer. With husband Doug Emhoff at her side, a laughing Harris hoisted her discovery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X