• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చిన్న కూటములు ప్రపంచాన్ని శాసించలేవు: ‘జీ7’కు చైనా వార్నింగ్

|

బీజింగ్: చైనాలో పుట్టిన కరోనావైరస్ మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న నేపథ్యంలో ఆ దేశంపై అమెరికాతో అనేక దేశాలు ఆగ్రహంగా ఉన్నాయి. అంతేగాక, చైనా సామ్రాజ్యకాంక్షతో పలు దేశాలను అక్రమంగా ఆక్రించుకుంది. ఇప్పటికీ అదే దారిలో నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు అగ్రదేశాలు ప్రయత్నిస్తున్నాయి.

  G7 Summit : China Warned G7 Leader | Oneindia Telugu

  చైనాను కట్టడి చేసేందుకు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల కూటమి జీ-7(అమెరికా, కెనడా, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్) దేశాధినేతలు తాజాగా భేటీయ్యాయి. ఈ నేపథ్యంలో జీ7 కూటమికే చైనా వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. చిన్న కూటములు కలిసి ప్రపంచాన్ని శాసించే కాలం ఎప్పుడో చెల్లిపోయిందని హెచ్చరించింది.

  ప్రపంచ దేశాలకు సంబంధించిన నిర్ణయాలను కేవలం కొన్ని దేశాలతో కూడిన చిన్న కూటములు నిర్దేశించే రోజులు ఎప్పుడో ముగిసిపోయాయని లండన్‌లోని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. చిన్న-పెద్ద, బలమైన-బలహీనమైనా, ధనిక-పేద ఇలా అన్ని దేశాలను చైనా సమానంగానే భావిస్తుందని చెప్పుకొచ్చారు. అందుకే ప్రపచం దేశాలకు సంబంధించిన అంశాలపై అన్ని దేశాల సంప్రదింపులతోనే నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

  ‘Small’ groups don’t rule the world, China warns to G7

  గత నాలుగు దశబ్దాలుగా గణనీయంగా పెరిగిపోతున్న చైనా ఆర్థిక, సైనిక శక్తిపై జీ-7 దేశాలు ప్రత్యేక దృష్టిసారించాయి. ఇందులో భాగంగానే చైనా నుంచి పొంచివున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఒక సమగ్ర వ్యూహంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో జీ-7 సదస్సులో ప్రస్తావించినట్లు తెలిసింది. చైనాకు చెక్ పెట్టేందుకు అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

  ఇది ఇలావుండగా, ప్రతిష్ఠాత్మకమైన జీ7 వర్చువల్ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని నిర్మూలించడానికి ప్రపంచం మొత్తం ఏకం కావాల్సిన అవసరం ఉందని, ఒకే విధానాన్ని అనుసరించాల్సిన సమయం ఏర్పడిందని అన్నారు. వన్ ఎర్త్.. వన్ హెల్త్.. కాన్సెప్ట్‌తో అన్ని దేశాలు ఈ సంక్షోభాన్ని అధిగమించాలని సూచించారు. కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ల తయారీకి అవసరమైన ముడి సరుకుల స్వేచ్ఛా వాణిజ్యానికి అవకాశం కల్పించాలని కోరారు.

  English summary
  ‘Small’ groups don’t rule the world, China warns to G7.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X