వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వీట్‌న్యూస్‌: మీ స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ .. జస్ట్ ఐదు నిమిషాల్లో ఫుల్‌చార్జ్ అవుతుంది!

జస్ట్ ఒక్క ఏడాది ఆగితే చాలు.. ఫోన్ బ్యాటరీని గంటల తరబడి చార్జ్ చేయాల్సిన బాధ తప్పుతుంది. ఇజ్రాయెల్‌ స్టార్టప్ ‘స్టోర్‌ డాట్‌’ ప్రవేశపెడుతున్న బ్యాటరీలు జస్ట్ ఐదు నిమిషాల్లో ఫుల్ చార్జ్ అవుతాయట.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు ఇజ్రాయెల్‌ స్టార్టప్ 'స్టోర్‌ డాట్‌' తీపి కబురు అందించింది. ఐదు నిమిషాల్లోనే ఫుల్‌చార్జింగ్‌ అయ్యే ఫ్లాష్‌ బ్యాటరీలను త్వరలో అందుబాటులోకి తేనున్నట్టు వెల్లడించింది.

అత్యంత వేగంగా బ్యాటరీని చార్జింగ్‌ చేయగల సాంకేతిక పరిజ్ఞానం గురించి 2015లో స్టోర్‌ డాట్ వెల్లడించింది. లాస్‌ వెగాస్‌లోని జరిగిన సీఈఎస్‌ టెక్‌ షోలో ఫ్లాష్‌ బ్యాటరీలను ప్రదర్శించింది.

యానోడ్‌ నుంచి కాథోడ్‌కు అయాన్లను పంపించే ఎలక్ట్రిక్‌ ప్రక్రియను వేగవంతం చేసే పదార్థాలను ఈ బ్యాటరీలలో పొందుపరిచారు. అతి సూక్ష్మమైన నానో మెటీరియల్స్‌, ఆర్గానిక్ కాంపౌడ్స్‌ వినియోగించి వీటిని తయారు చేశారు.

Smartphones that charge in five minutes 'could arrive next year'

వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ బ్యాటరీలు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని స్టోర్‌ డాట్ సీఈవో డొరొన్‌ మియర్స్‌డార్ఫ్‌ 'బీబీసీ'తో చెప్పారు. వీటిని మార్కెట్‌లోకి తీసుకు రావడానికి ఏర్పాట్లు పూర్తయినట్టు చెప్పారు.

ఫ్లాష్‌ బ్యాటరీలు ఐదు నిమిషాల్లోనే ఫుల్ చార్జ్‌ అవుతాయని చెప్పిన ఆయన వీటిని తయారు చేసేందుకు ఏ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారో చెప్పేందుకు మాత్రం నిరాకరించారు.

తాము అందించిన సాంకేతిక పరిజ్ఞానంతో ఆసియా ఖండానికి చెందిన రెండు బ్యాటరీ తయారీ సంస్థలు పైలట్‌ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టాయని, వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలోనే పెద్ద ఎత్తున ఫ్లాష్‌ బ్యాటరీలు తయారయ్యే అకాశముందని మియర్స్‌డార్ఫ్‌వివరించారు.

సంప్రదాయేతర చర్యలను ప్రేరేపించే పదార్థాలతో ఈ బ్యాటరీలను తయారు చేసినట్టు డొరొన్‌ మియర్స్‌డార్ఫ్‌ తెలిపారు. అయితే వీటి పనితీరుపై సాంకేతిక విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇలా వేగంగా చార్జ్‌ అయ్యే బ్యాటరీలను తయారు చేసేందుకు ఇప్పటికే చాలా కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి.

English summary
Smartphones with batteries that fully charge in five minutes could be available to consumers next year. The technology was first shown off in 2015, when Israeli start-up StoreDot demonstrated its FlashBattery at the CES tech show in Las Vegas.Chief executive Doron Myersdorf told the BBC it is now expected to enter production in early 2018. However, Ben Wood, a technology analyst at CCS Insight, said he had doubts about the claims. Mr Myersdorf said he could not reveal which manufacturers were signed up to use the technology.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X