వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషంకు విషమే విరుగుడు: పాము కాటుకు గురైతే పాము విషంతోనే చికిత్స

|
Google Oneindia TeluguNews

బ్రెజిల్: విషంకు విరుగుడు విషం అని పెద్దలు చెబుతుంటారు. ఇదే అక్కడ ఫాలో అవుతున్నట్లున్నారు. ఏటా ఆ దేశంలో చాలా మంది పాము కాటుకు గురవుతుంటారు. ఆ ప్రమాదకరమైన విషంకు విరుగుడుగా పాము విషంనే మందుగా వాడుతున్నారు. అవును ఇది నిజం. ఇంతకీ ఏదేశంలో ఏటా వేల మంది పాము కాటుకు గురవుతున్నారు..? విషంకు విషమే మందుగా ప్రయోగిస్తున్న దేశం ఏది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

బ్రెజిల్‌లో పాము కాటుకు గురవుతున్నవారు ఎక్కువ

బ్రెజిల్‌లో పాము కాటుకు గురవుతున్నవారు ఎక్కువ

బ్రెజిల్ దేశంలో దట్టమైన అడవులు ఉంటాయి. ఇక అక్కడ అత్యంత విషసర్పాలు కళ్లముందే తిరుగుతూ ఉంటాయి. అంతేకాదు ఈ పాము కాటుకు చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే ఇప్పుడు వారి ప్రాణాలను కాపాడేందుకు కొత్త మందు కనిపెట్టారు అక్కడి వైద్యులు. పాము విషంకు విరుగుడుగా విషమే అందిస్తున్నారు. సావ్ పాలో లోని బుటాంటన్ ఇన్స్‌టిట్యూట్‌లోకి వెళితే అక్కడ కొన్ని వందల పాములు కొన్ని బాటిల్స్‌లో పెట్టి ఉండటాన్ని గమనిస్తాము. ఆ విష సర్పాలను చూస్తే వెన్నులో వణుకు పుట్టడం గ్యారెంటీ.

పాము కాటుకు మందు కనిపెట్టిన డీసౌజా

పాము కాటుకు మందు కనిపెట్టిన డీసౌజా

బుటాంటన్ ఇన్స్‌టిట్యూట్‌లో డీ సౌజా అనే వైద్యురాలు మరియు సహచరులు కలిసి పాము కాటుకు గురైన వారికోసం మందు కనిపెట్టారు. అది కూడా పాము విషంతోనే మెడిసిన్ తయారు చేశారు. దేశవ్యాప్తంగా ఈ మెడిసిన్‌ను బ్రెజిల్ ఆరోగ్యశాఖ సరఫరా చేస్తోంది. బ్రెజిల్‌లో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో ఉంటాయి. ఆ వేడిమిని తట్టుకోలేక చాలా విషసర్పాలు జనాల మధ్య తిరుగుతుంటాయి. అందులో అత్యంత ప్రమాదకరమైన జరరకా అనే జాతికి చెందిన పాములు కూడా తిరుగుతుంటాయి.

 సున్నితమైన ప్రక్రియ ద్వారా పాము నుంచి విషం సేకరణ

సున్నితమైన ప్రక్రియ ద్వారా పాము నుంచి విషం సేకరణ

అధికారిక లెక్కల ప్రకారం 2018లో పాముకాటుకు 29వేల మంది గురయ్యారు. ఇందులో 100 మంది మృతి చెందారు. ఇక అమెజాన్ ప్రాంతం నుంచే ఎక్కువ మంది మృతి చెందడం విశేషం. ఇక ఇలా పాము కాటుకు గురైన వారికి విషంతోనే విరుగుడు ఇస్తున్నారు. ఇందులో భాగంగా నెలకోసారి ఒక పాము నుంచి అత్యంత సున్నితమైన ప్రక్రియ ద్వారా విషంను సేకరిస్తారు. ఒక కొక్కి ఉన్న కర్రతో జాగ్రత్తగా డబ్బాలో ఉన్న పామును బయటకు తీసి కార్బన్ డైయాక్సైడ్ ఉన్న ఒక డ్రమ్‌లోకి వేస్తారు. అలా వేసిన కొన్ని నిమిషాలకే పాము మత్తులోకి జోగి నిద్రపోతుంది.

 పాముకు ఆహారంగా ఎలుకలు

పాముకు ఆహారంగా ఎలుకలు

నిద్రలోకి జారుకున్న పామును తీసుకుని 27 డిగ్రీల టెంపరేచర్ ఉన్న గదిలో ఉంచుతారు. ఆ పాము నిద్ర నుంచి లేచేలోగా విషం సేకరించే ప్రక్రియను పూర్తి చేస్తారు. భయం అనేది ఉంటేనే విషం తీసే సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తారని డీసౌజా చెబుతున్నారు. ఇక పాముల్లో విషం పెంపొందించేందుకు చచ్చిన ఎలుకలను ఆహారంగా ఇస్తారు. ఈ ఎలుకలను లీఫీ ఇన్స్‌టిట్యూట్‌లో పెంచుతారు. నెలకు ఒకసారి ఎలుకలను ఆహారంగా ఈ పాములకు వేస్తారు. ఇక పాము నుంచి విషం సేకరించాక ఆ పాము యొక్క బరువును, పొడవును రికార్డు చేసి తిరిగి ప్లాస్టిక్ డబ్బాలో ఉంచుతారు.

గుర్రాలకు చిన్న మోతాదులో విషప్రయోగం

గుర్రాలకు చిన్న మోతాదులో విషప్రయోగం


ఇక ఈ విషంను అక్కడే పెంచుతున్న గుర్రాలకు చిన్న మోతాదులో ఇస్తారు. ఆ తర్వాత ఈ గుర్రాల నుంచి రక్తాన్ని తీసి ఇందులోని యాంటీ బాడీస్‌తో సీరంను తయారు చేస్తారు. దీన్నే పాము కాటుకు గురైన వ్యక్తికి ఇస్తారు. ఈ సీరం ఇవ్వకుంటే వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంది. ఏటా 10 నుంచి 15 మిల్లీలీటర్లు ఉన్న సీసాలు దాదాపు 2,50,000 తయారు చేస్తామని బుటాంటన్ ప్రాజెక్ట్ మేనేజర్ ఫాన్ హుయ్‌ వెన్ చెప్పారు. ఇక ఇతర దేశాలకు కూడా ఈ యాంటీ వెనమ్‌ను బ్రెజిల్ ఎగుమతి చేస్తుంది. ఆఫ్రికాలో ఎక్కువ మంది పాముకాటుకు గురై మృతి చెందుతుండగా ఆ దేశానికి కూడా ఈ మందును సరఫరా చేయాలని బ్రెజిల్ భావిస్తోంది.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణాంకాలు ఇవీ

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణాంకాలు ఇవీ

ఏటా పాము కాటుకు 5.4 మిలియన్ మంది ప్రజలు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలుచెబుతున్నాయి. ఇందులో 81 వేల నుంచి 1,38,000 మంది మరణిస్తుండగా... చాలా మంది విష ప్రభావంతో కొన్ని అవయవాలు ధ్వంసమై దివ్యాంగులుగా మిగిలిపోతున్నారని పేర్కొంది. ఈ క్రమంలోనే మరణాల సంఖ్య తగ్గించాలన్న ఉద్దేశంతో నాణ్యతగల పాము విషంతోనే మందు తయారు చేయాలని భావించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.

English summary
Gripping the deadly snake behind its jaws, Fabiola de Souza massages its venom glands to squeeze out drops that will save lives around Brazil where thousands of people are bitten every year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X