వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంచు తుపానుతో అమెరికా గజగజ! విద్యుత్ సరఫరా నిలిపివేత, వేల సంఖ్యలో విమానాల రద్దు...

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. బుధవారం నుంచి న్యూయార్క్, న్యూజెర్సీల్లో విపరీతంగా మంచు కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడపడితే అక్కడ మంచు కుప్పులుగా పేరుకుపోతోంది. మంచు తుపానుతో పాటు బలమైన గాలులు కూడా వీస్తున్నాయి.

న్యూయార్క్‌లో ఆరు నుంచి 10 అంగుళాల మేర, న్యూజెర్సీ, కనెక్టికట్‌లలో 20 అంగుళాల మేర మంచు పేరుకుపోయి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ మంచు తుపాను కారణంగా విమానాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది.

 తుపానుకు తోడుగా గాలి, వర్షం...

తుపానుకు తోడుగా గాలి, వర్షం...

అగ్రరాజ్యం అమెరికాను తీవ్రమైన మంచు తుపాను వణికిస్తోంది. ఈశాన్య అమెరికాలో భారీగా కురుస్తోన్న మంచుకు గాలి, వర్షం తోడవ్వడంతో కఠినమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయా ప్రాంతాల్లో రెండు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. ఫిలిడెల్ఫియా నుంచి బోస్టన్ వరకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. 6 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

కోట్ల మంది ప్రజలు చీకట్లో...

కోట్ల మంది ప్రజలు చీకట్లో...

ఆందోళనకరమైన ఈ పరిస్థితుల కారణంగా ప్రయాణానికి తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కోట్లమంది ప్రజలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఫిలడెల్ఫియా కేంద్రంగా నడుస్తున్న రైలు సర్వీసులను కూడా రద్దు చేస్తున్నట్లు రైల్వే సంస్థ అంట్రాక్ ప్రకటించింది. వారాంతం నుంచి సర్వీసులు పున:ప్రారంభంకానున్నాయని సంస్థ అధికారులు వెల్లడించారు.

 వేల సంఖ్యలో విమానాల రద్దు...

వేల సంఖ్యలో విమానాల రద్దు...

ఇప్పటికే న్యూయార్క్‌, న్యూజెర్సీ విమానాశ్రయాల్లో వందల సంఖ్యలో విమానాల రాకపోకలను నిలిపివేశారు. జాన్‌ ఎఫ్‌ కెన్నడీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో 470 విమానాలు, న్యూయార్క్‌‌ ఎయిర్‌పోర్టులో 550, లా గార్డియాఎయిర్‌పోర్టులో 485 విమానాలను రద్దు చేశారు. బుధవారం ఉదయం 10 గంటల సమయానికి దాదాపు 2,100కుపైగా విమానాలు రద్దయ్యాయి. మరో 300 విమానాలు వాయిదా పడ్డాయి.

ప్రయాణికుల కోసం ఏర్పాట్లు...

ప్రయాణికుల కోసం ఏర్పాట్లు...

విమానాల రద్దు ఫలితంగా ప్రయాణికులంతా ఆయా విమానాశ్రయాల్లోని వేచి ఉండాల్సి వచ్చింది. ప్రయాణికుల అవసరాల కోసం ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. పడకలు, దుప్పట్లు, చిన్నారుల కోసం డైపర్లు, ఫార్ములా పాలు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. మంచు తుపానుతో పాటు బలమైన గాలులు కూడా వీస్తుండడంతో అధికారులు అత్యవసర సేవలను ముమ్మరం చేశారు.

English summary
Near-blizzard conditions consumed portions of the East Coast on Wednesday evening as snow piled up, roadways became clogged with crashed cars and hundreds of thousands of people lost power. In New York City, seven to 11 inches had been predicted, although Central Park had recorded only 2.5 inches at 7 p.m. Travel plans were disrupted nationwide. More than 2,700 flights had been canceled across the country on Wednesday, according to FlightAware, including hundreds at each of three major airports serving the New York area. More than 2,400 additional flights had been delayed. More than 100,000 customers of the utilities Eversource and United Illuminating in Connecticut were without power around 8:45 p.m. Wednesday. And FirstEnergy, a utility company, reported a combined 178,000 customers without service in New York, New Jersey and Pennsylvania at 9:30 p.m.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X