వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో మంచు తుఫాను బీభత్సం: వాషింగ్టన్‌లో విద్యుత్ నిలిపివేత

అమెరికాలోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో ఈశాన్య ప్రాంతంలోని సుమారు రెండు లక్షల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో ఈశాన్య ప్రాంతంలోని సుమారు రెండు లక్షల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వాషింగ్టన్‌ డీసీ, న్యూయార్క్‌, ఫిలడెల్ఫియా, బోస్టన్‌ తదితర ప్రాంతాల్లో పలు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయమేర్పడుతోంది.

america

వర్జీనియా, మేరీలాండ్‌, మసాచుసెట్స్‌ తదితర ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది.

వాషింగ్టన్‌ డీసీ నగరంలో వేలాది ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వాషింగ్టన్‌ డీసీ, మేరీలాండ్‌, వర్జీనియాలతో పాటు పలు ప్రాంతాల్లో స్నో ఎమర్జెన్సీ ప్రకటించారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది.

English summary
The north-eastern US states of New York, New Jersey, Pennsylvania and Virginia have declared states of emergency as a huge winter storm sweeps in, bringing heavy snow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X