వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గెలుపు వెనుక ఆ రోబోలు! లేడీగాగా కన్నీరు, ట్రంప్ టవర్ ఎదుట నిరసన

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ గెలుపు వెనుక రోబోల పాత్ర కూడా ఉంది. నాల్డ్‌ ట్రంప్‌ విజయంలో 'సాఫ్ట్‌వేర్‌ రోబో'ల పాత్ర కూడా ఉందని చెబుతున్నారు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రాం వంటి సోషల్ మీడియా సైట్లలో చాట్‌బోట్‌లను ఎంచుకునే వీలుంది. అంటే సాఫ్ట్‌వేర్‌ రోబోలు అన్నమాట.

ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌తో పనిచేసే ఈ రోబోలు వాటంతట అవే పోస్టులు చేస్తాయి. అలా అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరం సందర్భంగా కొన్ని లక్షల చాట్‌బోట్‌లను వినియోగించారట. యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియాకు చెందిన కంప్యూటర్‌ పరిశోధకులు తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

donald trump

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఈ ఏడాది సెప్టెంబర్‌ 16 నుంచి అక్టోబర్‌ 21 వరకు 28లక్షల ఖాతాల నుంచి చేసిన దాదాపు రెండు కోట్ల ట్వీట్లను విశ్లేషించారని తెలుస్తోంది. వాటిల్లో నాలుగు లక్షల 96వేల చాట్‌బోట్‌ ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం ట్వీట్లలో 19శాతం ఈ చాట్‌బోట్లు చేసినవే!

రిపబ్లికన్ పార్టీ నుంచి గెలిచిన ట్రంప్‌తో పాటు డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన హిల్లరీ క్లింటన్‌కు కూడా చాట్‌బోట్‌లు ఉన్నాయి. ట్రంప్ మద్దతు చాట్‌బోట్‌లే ఎక్కువ ఉన్నాయి. ట్రంప్‌- హిల్లరీ మధ్య జరిగిన ఓపెన్‌ డిబేట్‌లకు సంబంధించిన విషయాలను వక్రీకరిస్తూ ఈ సాఫ్ట్‌వేర్‌ రోబోలు ట్రంప్‌కు అనుకూలంగా ట్వీట్లు చేశాయట. ఈ ఆటోమేటెడ్‌ ట్వీట్ల ద్వారా ట్విట్టర్‌ 'ట్రెండింగ్' టాపిక్స్‌లో ట్రంప్‌ నిలిచేలా చేశాయట.

ఎక్కడ, ఎలా?: రూ.500, రూ.1000 నోట్లు ఇలా మార్చుకోవచ్చు, మరిన్ని విషయాలు..ఎక్కడ, ఎలా?: రూ.500, రూ.1000 నోట్లు ఇలా మార్చుకోవచ్చు, మరిన్ని విషయాలు..

ట్రంప్ టవర్ ఎదుట లేడీ గాగా ఆందోళన

ట్రంప్‌ గెలిచారని తెలిసిన వెంటనే ప్రముఖ పాప్‌ గాయని లేడీ గాగా ట్రంప్‌ టవర్‌ ఎదుట ఆందోళనకు దిగింది. 'లవ్‌, ట్రంప్స్‌, హేట్‌' అని రాసి ఉన్న ప్లకార్డు పట్టుకుని శానిటేషన్‌ ట్రక్కుపై నిలబడి నిరసన వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి లేడీ గాగా హిల్లరీకే మద్దతు పలికింది.

హిల్లరీకి రాజకీయ అనుభవం, సమర్థత, నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, ఆమె అధ్యక్ష పదవికి పూర్తి అర్హురాలని గాగా పేర్కొంది. మంగళవారం రాత్రి క్లింటన్‌ ఎన్నికల నైట్‌ పార్టీలోనూ లేడీ గాగా వెనుక కూర్చుని కన్నీరు పెట్టిందని తెలుస్తోంది. ట్రంప్‌ గెలుపు ఖరారు అనుకున్న సమయంలో లేడీ గాగా ట్వీట్ చేసింది.

English summary
Lady Gaga Protested Outside Trump Tower During the Election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X