హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గల్ఫ్ లో రాగులు నిషేధం , తెలియక తీసుకెళ్లిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్ !

|
Google Oneindia TeluguNews

గల్ఫ్ దేశాల్లో రాగి జావ తాగినా.. నిషేధమేనట ! నిషేధం ఉన్న రాగులను మా దేశానికి తీసుకువస్తావా అంటూ అబుదాబి కస్టమ్స్ అధికారులు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అరెస్ట్ చేశారు. దీంతో ఆయన కుటుంభ సభ్యులు యూఏఈలోని ఎంబసీ తోపాటు, భారత ప్రభుత్వానికి తన గోడును వెళ్లబోసుకున్నారు.

యూఏఈ లో చిరు ధాన్యాలు నిషేధమా ?

యూఏఈ లో చిరు ధాన్యాలు నిషేధమా ?

ఎండలు మండే దేశంలో కాస్త రాగి జావ తాగి చల్లబడతామని అనుకున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి అనుకోని సంఘటన ఎదురైంది. గత కొద్ది కాలంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న దేశంలో రాగులు నిషేధం అని ఆయనకు తెలియదు, దీంతో అబుదాబి ఎయిర్ పోర్ట్ లో నాలుగు కిలోల చిరు ధాన్యాలతో పట్టుబడడంతో సదరు ఉద్యోగిని అరెస్ట్ చేశారు కస్టమ్స్ అధికారులు

హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కు ఎదురైన చేదు అనుభవం

హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కు ఎదురైన చేదు అనుభవం

హైదరాబాద్ అంబర్ పేట్ కు చెందిన కటకపు సంతోష్ రెడ్డి గత కొద్ది రోజులుగా యూఏఈలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటివల ఇండియాకు వచ్చిన సంతోష్ రెడ్డి ఎండలు ఎక్కువగా మండుతుండడంతో తనకు ఇష్టమైన రాగులను తీసుకెళ్లి , రాగి జావను చేసుకుందామని భావించాడు. దీంతో హైదరాబాద్ నుండి రెండు కిలోల రాగులను వెంట తీసుకెళ్లాడు. అయితే గల్ఫ్ దేశాల్లో చిరుధాన్యాలు నిషేధం ఉండడంతో అనుమానం ఉన్న కస్టమ్స్ అధికారులు సంతోష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తీసుకెళ్లిన చిరుధాన్యాలను సీజ్ చేసి ల్యాబ్ కు పంపారు.

యూఏఈ లో నిషేధం ఉన్న వస్తువులు...వాటిని తీసుకెళితే నాలుగేళ్లు శిక్ష

యూఏఈ లో నిషేధం ఉన్న వస్తువులు...వాటిని తీసుకెళితే నాలుగేళ్లు శిక్ష

సాధరణంగా యూఏఈ దేశాల్లో కొన్ని రకాల చిరుధాన్యాలు నిషేధం లిస్టులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా గసగసాలు, అలాగే పచ్చళ్లు, వడియాలు ,అప్పడాలు, కప్ప, పంది మాంసం తోపాటు జంతువుల రక్తంతో వండిన పదార్థాలతోపాటు డాక్టర్ ప్రిస్క్ర్రిప్షన్ లేకుండా తీసుకుళ్లే మందులు ఉన్నాయి. కాగా నిషేధం ఉన్న వస్తువులతో పట్టుపడితే నాలుగు సంవత్సరాల జైలు శిక్ష తోపాటు వీసా రద్దు చేసీ స్వదేశానికి పంపిస్తారు కూడ.

English summary
An NRI was arrested for possessing banned food grains here in Abu Dhabi. The arrested, K Santosh Reddy (37), a native of Marutinagar, Amberpet in Hyderabad was working as a software engineer in Abu Dhabi for some time now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X