వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అతను ఓ నరరూప రాక్షసుడు.. నరమేథానికి కుట్ర: అందుకే..: డొనాల్డ్ ట్రంప్.. !

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: వైమానిక దాడుల్లో దుర్మరణం పాలైన ఇరాన్ సైన్యాధ్యక్షుడు ఖాసిం సోలేమని ఓ నరరూప రాక్షసుడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. అమెరికాపై మహోగ్ర దాడికి కుట్ర పన్నాడనే విషయం తమ దృష్టికి వచ్చిందని, అందుకే ఆయనపై దాడి చేయాల్సి వచ్చిందని ట్రంప్ చెప్పారు. ఒక్క ఖాసింను చంపడం వల్ల వేలాదిమంది అమాయకుల ప్రాణాలను తాము రక్షించగలిగామని అన్నారు.

గ్రీస్ ప్రధానమంత్రితో భేటీలో ఖాసిం ప్రస్తావన..

గ్రీస్ ప్రధానమంత్రి కైరియాకోస్ మిట్సోటకిస్ తో తన అధికారిక నివాసంలో అత్యున్నత సమావేశం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా వైమానిక దళం ప్రయోగించిన క్షిపణి దాడుల్లో ఖాసిం సోలేమని మరణించిన విషయం తెలిసిందే. ఖాసింను లక్ష్యంగా చేసుకుని, ఉద్దేశపూరకంగానే అమెరికా ఈ వైమానిక దాడులను నిర్వహించింది.

మారణ హోమానికి కుట్ర..

మారణ హోమానికి కుట్ర..

తన చర్యలను తాజాగా డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. గ్రీస్ ప్రధానమంత్రితో సమావేశంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఖాసింను ఓ నరరూప రాక్షసుడిగా సంబోధించారు. ఖాసిం ఇంకొన్ని రోజుల పాటు జీవించి ఉండి ఉంటే.. దారుణ పరిస్థితులు ఎదురై ఉండేవని ట్రంప్ అభిప్రాయపడ్డారు. భారీ ఎత్తున మారణ హోమాన్ని సృష్టించడానికి ఆయన కుట్ర పన్నాడని, తమ గూఢచర్య ఏజెన్సీల ద్వారా దీనికి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించామని అన్నారు.

అన్నీ ధృవీకరించుకున్న తరువాతే..

తమ రక్షణ మంత్రిత్వ శాఖకు అందిన సమాచారాన్ని అన్ని కోణాల్లోనూ విశ్లేషించామని, అవన్నీ నిజమని ధృవీకరించుకున్న తరువాతే.. ఖాసింను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులను చేయాల్సి వచ్చిందని అన్నారు. తమ చర్యల వల్ల వందలాది మంది ప్రాణాలను తాము కాపాడగలిగామని ట్రంప్ వివరించారు. ఖాసింను చంపడం వల్ల తమపై ఎవరూ వేలెత్తి చూపలేరని, తమ చర్యలను ఏ ఒక్కరు కూడా తప్పు పట్టబోరని తాను అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు.

ఇరాన్ ప్రతీకార దాడులు..

ఇరాన్ ప్రతీకార దాడులు..

ఇదిలావుండగా.. ఖాసిం సోలేమని హత్యాకాండకు నిరసనగా ఇరాన్ తాజాగా అమెరికాపై ప్రతీకార దాడులకు దిగింది. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన చాపర్, కొన్ని డ్రోన్లు, మిస్సైళ్లు ధ్వంసమైనట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ సైతం ధృవీకరించింది. ఇరాక్ లోని తమ స్థావరాలపై క్షిపణి దాడులు చోటు చేసుకున్నాయని, వాటిని ఇరాన్ ప్రయోగించినట్లు అనుమానిస్తున్నామని స్పష్టం చేసింది.

English summary
President Donald Trump has said the US killing of Iranian commander Qasem Soleimani saved a lot of lives, calling him a "monster". Trump said Soleimani "was planning a big attack" when he was killed in a US drone strike in Baghdad last Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X