వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీవ్రవాద దాడి: సోమాలియాలో భారీ బాంబు పేలుడు, 230 మంది మృతి

సోమాలియాలో శనివారం ఉగ్రవాదులు మారణహోమానికి తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో 230 మంది మృతి చెందారు. 275 మందికిపైగా గాయపడ్డారు.

|
Google Oneindia TeluguNews

మొగదిషు: సోమాలియాలో శనివారం ఉగ్రవాదులు మారణహోమానికి తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో 230 మంది మృతి చెందారు. 275 మందికిపైగా గాయపడ్డారు.

రాజధాని మొగదిషులోని ఓ హోటల్‌ లక్ష్యంగా ముష్కరులు ట్రక్‌ బాంబుతో దాడికి పాల్పడ్డారు. తర్వాత కాల్పులు జరిపారు. ఉగ్రదాడి జరిగిన ప్రాంతమంతా బీభత్సంగా మారింది.

Somalia: Bomb blast outside hotel in Mogadishu; 189 killed

పేలుడు ధాటికి దూరంలో ఉన్న భవనం కిటికీ అద్దాలు సైతం పగిలిపోయాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

సోమాలియాకు చెందిన అల్‌షబాబ్‌ అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటనలో తొలుత 189 మంది చనిపోయినట్లు తెలిసింది. ఆ తర్వాత మృతుల సంఖ్య 230కు పెరిగింది.

English summary
A truck bomb exploded outside a hotel at a busy junction in Somalia's capital Mogadishu on Saturday causing widespread devastation that left at least 189 dead, with the toll likely to rise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X