భారత పడవను రక్షించిన సోమాలియా దళాలు: పైరట్ల నిర్బంధంలోనే భారతీయులు

Subscribe to Oneindia Telugu

మొగదిషు: సోమాలియా సముద్రపు దొంగలు వారం రోజుల క్రితం నిర్బంధించిన భారత పడవను ఆ దేశ భద్రతా దళాలు విడిపించాయి. పడవలోని 11మందిలో ఇద్దరు భారతీయులను కాపాడాయి. కానీ, మరో తొమ్మిది మంది భారతీయులు మాత్రం ఇంకా ఆ దొంగల నిర్బంధంలోనే ఉన్నారు.

ఈ మేరకు వివరాలను హొబ్యో నగర మేయర్‌ అబ్దుల్లాహి అహ్మద్‌ సోమవారం తెలిపారు.
ఐదేళ్లుగా ఇక్కడి తీరంలో గస్తీపై ప్రపంచ దేశాలు దృష్టిపెట్టడంతో దాడులు కొంతవరకూ తగ్గుముఖం పట్టాయి. సోమాలియా ప్రభుత్వ అస్థిరత్వం కారణంగా ఇటీవల కాలంలో మళ్లీ దాడులు పెరుగుతున్నాయి.

Somalia piracy: Indian ship freed but hijackers take crew

ఇది ఇలా ఉండగా, సొమాలియా రాజధాని మొగదిషు శివారులో సైనిక దుస్తులు ధరించిన ఓ ఉగ్రవాది ఒక సైనిక శిక్షణ శిబిరంపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. సోమవారం జరిగిన ఈ ఘటనలో తొమ్మిది మంది సైనికులు మృతిచెందారు. మరో 12 మంది గాయపడ్డారు.
దాడి తమ పనేనని అల్‌ఖైదా అనుబంధ అల్‌ షబాబ్‌ చెప్పింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Somali security forces have rescued an Indian cargo ship seized by pirates earlier this month, but the hijackers took nine of the 11-man crew when they fled ashore.
Please Wait while comments are loading...