వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రులు: ప్రీతి షాప్ కీపర్ కూతురు, సాజిద్ పాక్ బస్సు డ్రైవర్ కొడుకు

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ మంత్రివర్గంలో చోటు దక్కిన భారతీయురాలు ప్రీతి పాటిల్... ఉగండాలో ఓ షాప్ కీపర్ కూతురు. కేబినెట్లో చోటు దక్కించుకున్న పాక్ జాతీయుడు సాజిద్ జావిద్ ఓ బస్సు డ్రైవర్ కొడుకు కావడం గమనార్హం. డేవిడ్ కామెరూన్ మంత్రివర్గంలో వీరిద్దరికీ చోటు దక్కింది.

ప్రీతి పటేల్ 1972 మార్చి 29న జన్మించారు. ఆమె జాన్ మేజర్ నేతృత్వంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీలో నాడు చేరారు. ఈమె ఎసెక్స్ నుండి మొదటిసారి 2010లో ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడు రెండోసారి గెలిచారు. ప్రీతి పటేల్ లండన్లో జన్మించారు.

Son of a Pakistani bus driver and daughter of a Ugandan shopkeeper who fled Idi Amin are two big winners in 'Blue Collar' reshuffle

ఇక, పాక్ జాతీయుడు సాజిద్ జావిద్ తండ్రి బస్సు డ్రైవర్. ఇతను 1969 డిసెంబర్ 5న జన్మించారు. సాజిద్ కూడా బ్రోమ్స్‌గ్రోవ్ నుండి 2010లో ఎంపీ అయ్యారు. ఇప్పుడు మరోసారి గెలిచారు.

కాగా, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ మంత్రివర్గంలో ప్రీతి పటేల్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. ఇటీవలి ఎన్నికలలో రెండోసారి గెలిచిన ప్రీతి పాటిల్‌ను ఉపాధి కల్పన శాఖ మంత్రిగా నియమించారు. మే ఏడో తేదీన జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎస్సెక్స్‌లోని విఠమ్ నుండి ఆమె ఎంపీగా తిరిగి గెలుపొందారు. గత మంత్రివర్గంలో ఆర్థిక శాఖ సహాయమంత్రిగా ఆమె పని చేశారు.

పాకిస్తాన్ సంతతికి చెందిన ఎంపీ సాజిద్ జావిద్‌ను కూడా కూడా కామెరూన్ కేబినెట్లోకి తీసుకున్నారు. సాంస్కృతిక శాఖ నుండి వాణిజ్య శాఖ మంత్రిగా సాజిద్‌ను మార్చారు.

English summary
Son of a Pakistani bus driver and daughter of a Ugandan shopkeeper who fled Idi Amin are two big winners in 'Blue Collar' reshuffle
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X