వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: 14 నిమిషాల్లోనే పెను విధ్వంసం, చైనా చేతిలో కొత్త ఆయుధం

By Narsimha
|
Google Oneindia TeluguNews

బీజింగ్: ప్రపంచంలో ఎక్కడికైనా 14 నిమిషాల్లో వెళ్ళి విధ్వంసం సృష్టించగల హైపర్‌సానిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను చైనా రూపొందిస్తోంది. ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే సైనిక సంపత్తిలో అగ్రస్థానంలో ఉండేందుకు చైనా ఏర్పాట్లు చేసుకొంటుంది.

ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా ఉన్న అమెరికా, రష్యా లాంటి దేశాల్లో లేని ఆయుధ సంపత్తిని చైనా తయారు చేస్తోంది. ఇతర దేశాల కంటే సైన్యంలో అన్ని విభాగాల్లో ముందుండేలా చైనా ప్లాన్ చేస్తోంది.

చైనా కొంత కాలంగా హైపర్‌సానిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ విషయమై కేంద్రీకరించింది. తాము అనుకొన్న లక్ష్యాన్ని క్షణాల వ్యవధిలో చేరుకొని నాశనం చేసేలా ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారు చేస్తున్నారు.

14 నిమిషాల్లోనే ఎక్కడికైనా

14 నిమిషాల్లోనే ఎక్కడికైనా

ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే హైపర్‌సానిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను చైనా రూపొందిస్తోంది. అణువార్‌హెడ్లను మోసుకెళ్లగలిగే సామర్థ్యంతో దీనిని రూపొందిస్తున్నట్లు చైనాకు చెందిన సౌత్ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ప్రపంచంలో ఎక్కడికైనా ఈ ఎయిర్‌క్రాఫ్ట్ 14 నిమిషాల వ్యవధిలోనే చేరుకొంటుంది.

 సెకనుకు 12 కి.మీ వేగం

సెకనుకు 12 కి.మీ వేగం

సెకను 12 కిలోమీటర్ల వేగంతో ఎయిర్‌క్రాఫ్ట్‌ దూసుకు వెళుతుంది.కేవలం 14 నిమిషాల వ్యవధిలో ప్రపంచంలోనూ ఏ ప్రాంతాన్ని అయినా ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ చేరుకొంటుంది. అంతేకాదు క్షణాల్లో ఆ ప్రాంతంలో విధ్వసం సృష్టించనుంది.

ధ్వని వేగం కంటే 35 రెట్ల వేగం ఎక్కువ

ధ్వని వేగం కంటే 35 రెట్ల వేగం ఎక్కువ

ఈ హైపర్‌సానిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ధ్వని వేగంకన్నా 35 రెట్లు వేగంగా ప్రయాణించనుంది నిపుణులు చెబుతున్నారు.. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ 2020 నాటికి అందుబాటులోకి రావచ్చని సమారం. అత్యాధునిక అణుబాంబులను కూడ ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లు నిర్ణీత లక్ష్యానికి చేర్చుతాయి.

గురి తప్పకుండా లక్ష్యసాధన

గురి తప్పకుండా లక్ష్యసాధన

2013 నుంచి చైనా హైపర్‌సానిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీపై దృష్టి సారించింది. ఇప్పటికే 7 టెస్ట్‌ ఫ్లయిట్లను విజయవంతంగా పరీక్షించింది. హైపర్‌సానిక్‌ గ్లైడర్‌ డీఎఫ్‌-జెడ్‌ఎఫ్‌ రకం మిసైళ్లు, అణుబాంబులను విజయవంతంగా మోసుకెళ్లడంతో పాటు లక్ష్యాన్ని ఖచ్చితంగా చేధించి సర్వనాశనం చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

English summary
China is building a hypersonic aircraft capable of carrying a nuclear warhead and travel at a tremendous speed of 12 kilometers per second, which means it will be able to reach the shores of the United States of America within 14 minutes.The carrier, which can travel at a speed 35 times the speed of sound, will be tested in ‘wind tunnel’ that China is building, which is set to be the world’s fastest hypersonic facility by the year 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X