• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దక్షిణాఫ్రికా: ఒకే కాన్పులో 10 మంది బిడ్డలకు జన్మనిచ్చిన తల్లి

By BBC News తెలుగు
|

దక్షిణ ఆఫ్రికాలోని ప్రెటోరియాలో ఒక మహిళ సోమవారం ఒకే కాన్పులో 10 మంది శిశువులకు జన్మనిచ్చి కొత్త రికార్డును సృష్టించారు.

గోసియేమ్ థమారా సిట్‌హోల్‌కు స్కానింగ్ చేసినప్పుడు ఆమె గర్భంలో 8 మంది పిల్లలే ఉన్నట్లు చెప్పగా, ఇప్పుడు 10 మంది పుట్టడంతో ఆమె భర్త ఆశ్చర్యపోతున్నారు.

"మేము స్కానింగ్ చేయించినప్పుడు ఆమె గర్భంలో ఏడుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నట్లు తెలిసింది. నేను చాలా ఆనందించాను. చాలా భావోద్వేగానికి లోనయ్యాను. ప్రస్తుతానికి నేనింకేమీ మాట్లాడలేను" అని ఆమె భర్త టెబోహో సోటేట్సి ప్రెటోరియా న్యూస్‌కు చెప్పారు.

గోసియేమ్ 10 మంది పిల్లలకు జన్మనిచ్చినట్లు ఒక దక్షిణ ఆఫ్రికా అధికారి బీబీసీకి ధ్రువీకరించారు. కానీ, ఇంకా శిశువులను చూడాల్సి ఉందని మరొక అధికారి అన్నారు.

గోసియేమ్ సాధారణ ప్రసవం ద్వారా ఐదుగురు బిడ్డలకు జన్మనివ్వగా, మిగిలిన ఐదుగురును సిజేరియన్ ద్వారా కన్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని వారి కుటుంబ సభ్యులొకరు బీబీసీకి చెప్పారు.

ఈ జననాల రికార్డును పరిశీలిస్తున్నట్లు గిన్నిస్ ప్రపంచ రికార్డ్ బీబీసీకి చెప్పింది.

ఒకే కాన్పులో అత్యధిక పిల్లలను కన్న రికార్డుల్లో 2009లో 9 మంది బిడ్డలను కన్న అమెరికన్ మహిళ ఉన్నారు.

గత నెలలో మాలికి చెందిన 25 సంవత్సరాల హలీమా సిస్సి తొమ్మిది మంది బిడ్డలకు జన్మనిచ్చారు. వీరంతా ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిసింది.

అయితే, ఎక్కువ మంది బిడ్డలకు జన్మనిచ్చిన వాటిలో చాలా మంది శిశివులు రోజుల వయసులోనే మరణిస్తారు" అని బీబీసీ ఆఫ్రికా హెల్త్ ప్రతినిధి రోడా ఒడియామ్బో అన్నారు.

ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలను కన్న సంఘటనలు అరుదుగునా జరుగుతూ ఉంటాయి. ఇవి ముఖ్యంగా సంతానోత్పత్తి కోసం తీసుకునే చికిత్సల్లో ఇలాంటి జననాలు కలిగే అవకాశం ఉంది. కానీ, ప్రెటోరియాలో మహిళ సహజంగానే గర్భం దాల్చినట్లు చెబుతున్నారు.

ప్రార్థనలు, నిద్ర లేని రాత్రులు...

37 సంవత్సరాల గోసియేమ్ గతంలో కవల పిల్లలకు జన్మనిచ్చారు. వారికిప్పుడు 6 సంవత్సరాలు.

ఆమె గర్భం దాల్చిన 9 వారాలకు పిల్లలకు జన్మనిచ్చారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని చెబుతున్నారు.

ఆమె గర్భం దాల్చిన మొదట్లో చాలా కష్టంగా అనిపించేదని, పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలని ప్రార్ధన చేస్తూ, ఏమవుతుందోననే భయంతో నిద్ర లేని రాత్రులు గడిపానని ఆమె గత నెలలో ప్రెటోరియా న్యూస్‌తో చెప్పారు.

"వారంతా ఈ పొట్టలో సరిపోతారా? వారు బ్రతుకుతారా?" అని ఆమె తనను తానే ప్రశ్నించుకునేవారు. కానీ, పిల్లలు పట్టేందుకు వీలుగా ఆమె పొట్ట సాగుతున్నట్లు ఆమెకు డాక్టర్లు చెప్పారు.

ప్రతీకాత్మక చిత్రం

ఆమె గర్భంతో ఉన్నప్పుడు, కాళ్ళ నొప్పులతో బాధ పడుతూ ఉండేవారు. అయితే, 8 మందిలో రెండు పిండాలు తప్పు ట్యూబ్‌లో ఉన్నాయని డాక్టర్లు చెప్పారు.

అది కూడా సరి చేసిన తర్వాత ఆమె బాగానే ఉన్నానని చెప్పారు. "నా పిల్లలను చూసేందుకు నేనిక వేచి ఉండలేను" అని ఆమె వార్తాపత్రికకు చెప్పారు.

ఆమె భర్త కూడా తనకు "ఆకాశంలో తేలుతున్నట్లుగా ఉందని, పిల్లల కోసం తమను భగవంతుడు ఎంపిక చేసుకున్న బిడ్డలుగా అనిపిస్తోందని, ఈ అద్భుతాన్ని నేను ప్రశంసిస్తున్నాను" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
South Africa: A mother who gave birth to 10 children in a single birth
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X