వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దక్షిణాఫ్రికాలో భారత రాయబారి ఫ్యామిలీని బంధించి, దోపిడీ

దక్షిణాఫ్రికాలో భారత రాయబారి శశాంక్ విక్రమ్ కుటుంబాన్ని బంధించిన దుండగులు... దోపిడీకి పాల్పడ్డారు. డర్బన్‌లోని వారి అధికారిక నివాసంలోనే ఈ దోపిడీ జరగడం గమనార్హం.

|
Google Oneindia TeluguNews

జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో భారత రాయబారి శశాంక్ విక్రమ్ కుటుంబాన్ని బంధించిన దుండగులు... దోపిడీకి పాల్పడ్డారు. డర్బన్‌లోని వారి అధికారిక నివాసంలోనే ఈ దోపిడీ జరగడం గమనార్హం.

భారత కాన్సల్ జనరల్‌‌గా శశాంక్ విక్రమ్.. డర్బన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. శశాంక్ విక్రమ్ ఫ్యామిలీ, ఇద్దరు చిన్నారులు, సిబ్బంది, వీరి వద్దకు వచ్చిన ఓ టీచర్‌ను బంధించిన దుండగులు.. ఇంట్లోని విలువైన ఆభరణాలు, నగదు, వస్తువులను దోచుకెళ్లినట్లు తెలిసింది.

South Africa: Indian envoy's family held hostage, robbed in Durban

అయితే, బాధితులంతా బాగానే ఉన్నారని, కానీ కొంత భయాందోళనకు గురయ్యారని చెప్పారు. దుండగులు ఎవరికీ ఏ హాని తలపెట్టలేదని కాన్సల్ ఎస్కే పాండే తెలిపారు. శశాంక్ ఇంట్లోని ఓ సిబ్బందికి చెందిన ఫోన్‌ను కూడా దొంగలు ఎత్తుకెళ్లారని, దాని ద్వారా నిందితులను పట్టుకోవచ్చని చెప్పారు.

ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. వియన్నా కన్వెన్షన్ ప్రకారం.. రాయబారులకు రక్షణ కల్పించడం దక్షిణాఫ్రికా బాధ్యత అని భారత్ గుర్తు చేసింది. కాగా, ఘటనపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Robbers target and briefly held hostage of India's Consul-General's family in the South African city of Durban was targeted by robbers at their official residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X