వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ స్కాలర్ షిప్ పొందాలంటే ’కన్య’గా వుండాలి

|
Google Oneindia TeluguNews

జోహన్నెస్‌బర్గ్: ఎక్కడైనా పాఠశాలలు, కళాశాలల్లో స్కాలర్‌షిప్‌లు రావాలంటే మంచి మార్కులు, హాజరులాంటివి కొలమానంగా పరిగణిస్తుంటారు. అయితే దక్షిణ ఆఫ్రికాలోని క్వాజులా నాతల్‌ రాష్ట్రంలోని ఉతుకెలా జిల్లాలో మాత్రం స్కాలర్‌షిప్‌ కావాలనుకునే బాలికలు, యువతులకు ఉండాల్సిన అర్హత.. కన్యత్వమే కావడం గమనార్హం..

అయితే, ఇలా నిర్ణయించడానికి కారణాలు కూడా ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. అక్కడ పలువురు బాలికలు చదువు పూర్తయ్యేలోపు తల్లులవుతున్నారు. అంతేగాక, అక్కడి విద్యాశాఖ అందించిన వివరాల ప్రకారం.. పాఠశాలల్లోనే గర్భం దాల్చిన బాలికల సంఖ్య ఇప్పటి వరకు దాదాపు 20,000.

2014లో పాఠశాలల్లో గర్భవతులుగా ఉన్న బాలికల సంఖ్య 223గా ఉందట. ఇలా చిన్న వయసులోనే గర్భధారణను అరికట్టేందుకు, హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ లాంటి వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవటం, బాలికలు చదువు పూర్తయ్యే వరకు పూర్తిగా దానిపైనే దృష్టిని కేంద్రీకరించాలని భావిస్తూ ఆ ప్రాంత మేయర్‌ ఈ స్కాలర్‌షిప్‌లను ప్రతిపాదించారు.

South African mayor awards scholarships to virgin women

స్కాలర్‌షిప్‌లు కావాలనుకునేవారు కన్యత్వ పరీక్షల్లో పాస్‌కావాల్సి ఉంటుందట. వీటి కోసం స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకు రావచ్చని ఆయన తెలిపారు. మేయర్‌ నిర్ణయంపై కొందరు స్వచ్ఛంద కార్యకర్తలు మండిపడుతున్నారు.

కన్యత్వ పరీక్షలు నిర్వహించడం సరికాదని అంటున్నారు. అయితే ఆ ప్రాంత మేయర్‌ డుడు మజిబుకో మాత్రం ఇది బాలికల మంచికేనని వారి సమ్మతితో కన్యత్వ పరీక్షలు జరపడం చట్ట విరుద్ధం కాదని పేర్కొన్నారు.

English summary
A South African mayor has awarded college scholarships to 16 young women for remaining virgins to encourage others to be "pure and focus on school," her spokesman said Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X