• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జాక్ పాట్: ఈ లాటరీ పై డబ్బులు ఎన్ని వచ్చాయో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది

|

సౌత్ కరోలినా: సాధారణంగా ఒక పదిలక్షలు లాటరీ తగిలిందన్న వార్త వినగానే ఎగిరి గంతేస్తాం. అలాంటిది కోటి రూపాయలు తగిలిందని తెలిస్తే ఆనందాన్ని తట్టుకోలేము.. అదే 10 కోట్ల రూపాయల లాటరీ తగిలిందని తెలిస్తే ఇక ఆకాశంలో విహరిస్తాం. ఇదంతా కాకుండా ఒకేసారి 160 కోట్ల రూపాయల లాటరీ తగిలితే పరిస్థితి ఎలాగుంటుంది? ఊహకు అందదు కదా.. సరిగ్గా ఇదే జరిగింది. ఎవరికో తెలుసా... అదే తెలియదు.

సౌత్ కరోలినా టికెట్‌కు రూ.160 కోట్లు లాటరీ

సౌత్ కరోలినా టికెట్‌కు రూ.160 కోట్లు లాటరీ

దక్షిణ కరోలినాలో మెగా మిలియన్ లాటరీ సంస్థ అమ్మిన లాటరీ టికెట్‌కు అక్షరాల 1.6 బిలియన్ డాలర్లు తగిలిందని అధికారులు తెలిపారు. ఇది భారత కరెన్సీలో రూ.160 కోట్లు. ఇది ప్రపంచంలోనే అత్యధిక ధర పలికిన లాటరీ అని చెప్పారు. అయితే ఈ లాటరీ కొన్న వ్యక్తి వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. సౌత్ కరోలినాలో అమ్మిన టికెట్‌పై ఉన్న ఆరెంకల సంఖ్య లాటరీ నంబర్‌తో సరిపోయిందని వారు వెల్లడించారు. అయితే ఈ టికెట్ ఎవరు కొన్నారో ఇంకా ప్రపంచానికి తెలియాల్సి ఉంది.

 లక్కీ వ్యక్తి ప్రపంచానికి తెలియకపోవచ్చు

లక్కీ వ్యక్తి ప్రపంచానికి తెలియకపోవచ్చు

సౌత్ కరోలినా రాష్ట్రంతో పాటు డెలావేర్, జార్జియా, కన్సాస్, మేరీల్యాండ్, నార్త్ డకోటా, ఓహియో, టెక్సాస్ రాష్ట్రాల్లో లాటరీ తగిలిన వారు తమ పేర్లను బహిర్గం చేయకుండా రహస్యంగానే ఉంచమని చెప్పే అధికారం ఉంది. దీంతో ప్రస్తుతం 160 కోట్ల రూపాయల లాటరీ తగిలిన ఆ లక్కీ వ్యక్తి ఎవరో ప్రపంచానికి ఎప్పటికీ తెలియకపోవచ్చు. అయితే లాటరీ తగిలిని వ్యక్తికి మొత్తం డబ్బులు ఒకేసారి కాకుండా 29 ఏళ్ల పాటు చెల్లిస్తారు. అయితే లాటరీ తగిలిన ప్రతి వ్యక్తి క్యాష్ తీసుకునేందుకే ఇష్టపడతారు.

ఇలా భారీ స్థాయిలో డబ్బులు తగలడం చాలా చాలా అరుదు

ఇలా భారీ స్థాయిలో డబ్బులు తగలడం చాలా చాలా అరుదు

ఇక గెలుపొందిన లాటరీ టికెట్ నెంబర్‌లు ఈ విధంగా ఉన్నాయి. 5,28,62,65,70. ఇందులో టికెట్ నెంబర్ 5కు భారీగా 160 కోట్ల రూపాయలు తగిలింది. ఇదిలా ఉంటే లాటరీ టికెట్‌పై ఉన్న అన్ని సంఖ్యలు సరిపోలడం చాలా అరుదుగా జరుగుతుంటుందని అధికారుల తెలిపారు. 302.5 మిలియన్ మందిలో ఒకరికి తగులుతుందని చెప్పారు. మెగా మిలియన్ లాటరీ 44 రాష్ట్రాల్లో నిర్వహిస్తారు. ఇందులో వాషింగ్టన్ డీసీ, అమెరికా వర్జిన్ ఐలాండ్స్ కూడా ఉన్నాయి. ఇక డబ్బులు గెలిచిన వ్యక్తి దాన్ని తీసుకునేందుకు సమయం 6నెలల నుంచి ఏడాది వరకు ఉంటుంది. ఆలోగా డబ్బులు తీసుకోకుంటే ఇక డబ్బులు కంపెనీ చెల్లించదు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Lottery officials say someone has won the record $1.6 billion Mega Millions jackpot.Mega Millions officials said a ticket purchased in South Carolina matches all six numbers in Tuesday night’s drawing. The massive jackpot is the world’s largest ever lottery grand prize.And it’s possible that the world will never know the winner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more