వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్ ‘దొంగాట’, ఒక్కటవుదాం అంటూనే.. భారీ మిలిటరీ పరేడ్‌కు సన్నాహాలు!

ఉత్తర, దక్షిణ కొరియాల ఏకీకరణకు పిలుపునిచ్చి ప్రపంచ దేశాలను ఆశ్చర్చపరిచిన కిమ్ జాంగ్ ఉన్.. దక్షిణ కొరియాలో శీతాకాల ఒలింపిక్స్ ప్రారంభానికి ఒక్కరోజు ముందు భారీ సైనికపరేడ్ నిర్వహిస్తుండడం చర్చనీయాంశమైంది

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా నియంత నమ్మలేని విధంగా ఓ కీలక ప్రకటన చేసి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచారు. 'ఒక్కటవుదాం..' అంటూ ఉత్తరకొరియా, దక్షిణ కొరియాల ఏకీకరణకు ఆయన పిలుపునిచ్చారు.

ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలు ఇతర దేశాల సహాయం అవసరం లేకుండా ఒక్కటవడానికి ముందడుగు వేయాలి అని కిమ్ ఆకాంక్షించారు. అంతేకాదు, కొరియన్‌లు అందరూ సంబంధ బాంధవ్యాలు పెంచుకోవాలి. పరస్పరం సహకారం అందించుకోవాలని కూడా కోరారు.

రూటు మార్చిన కిమ్ జాంగ్ ఉన్...

రూటు మార్చిన కిమ్ జాంగ్ ఉన్...

దక్షిణ కొరియా పేరు చెబితేనే అగ్గిమీద గుగ్గిలం అయ్యే ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఇప్పుడు రూట్ మార్చారు. కొరియన్ల ఏకీకరణకు పిలుపునిచ్చారు. అంతేకాదు, ఈ ఏకీకరణలో ఎదురయ్యే సవాళ్లను కూడా ఉత్తరకొరియా తిప్పి కొడుతుందంటూ ఇటు కొరియన్లనే కాదు, అటు ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యపరిచారు. కిమ్‌లో ఈ స్థాయి మార్పుు చూసి అందరికంటే అధికంగా ఆశ్చర్యపోతున్నది అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే.

చివరి క్షణంలో కిమ్ ప్రతిపాదన...

చివరి క్షణంలో కిమ్ ప్రతిపాదన...

వచ్చే నెల దక్షిణ కొరియా తూర్పు రాష్ట్రమైన ప్యాంగ్‌చాంగ్‌లో శీతాకాల ఒలింపిక్స్ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ దేశ క్రీడాకారులతోపాటు ‘ఛీర్ లీడర్స్'నూ పంపించాడు కిమ్. అంతేకాదు, చివరి నిమిషంలో మరో ప్రతిపాదన కూడా చేశాడు. ‘మా క్రీడాకారులు.. మీ దేశ క్రీడాకారులతో కలిసి మార్చ్‌ఫాస్ట్ చేస్తారు'అంటూ కిమ్ జాంగ్ ఉన్ ప్రతిపాదన చేయడంతో దక్షిణ కొరియా సరేనంది. నీలం, తెలుపు రంగుల జెండాతో కలిసి సాగడానికి ఉభయ కొరియాల నడుమ ఒక అవగాహన కూడా కుదిరింది.

అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త మిలిటరీ డ్రిల్ వాయిదా...

అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త మిలిటరీ డ్రిల్ వాయిదా...

ఎన్నడూ లేనివిధంగా ఉత్తరకొరియా అధినేత స్నేహ హస్తం చాచడంతో దక్షిణ కొరియా ఉబ్బితబ్బిబ్బవుతోంది. పోనీలే.. ఇన్నాళ్లకైనా కిమ్ జాంగ్ ఉన్‌లో కాస్తయినా మార్పు కనిపిస్తోందంటూ పొంగిపోతోంది. దక్షిణ కొరియాలో జరగబోయే శీతాకాల ఒలింపిక్స్‌కు తన దేశ క్రీడాకారులను కూడా పంపడమే కాకుండా ఉభయ కొరియాలు కలిసిపోవాలంటూ కిమ్ ఆకాంక్షించడం కూడా దక్షిణ కొరియాకు పన్నీటి జల్లులా అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాతో కలిసి చేపట్టాల్సిన సంయుక్త మిలిటరీ విన్యాసాలను కూడా ఆ దేశం వాయిదా వేసుకుంది.

కిమ్‌లో మార్పు నిజమేనా?

కిమ్‌లో మార్పు నిజమేనా?

హఠాత్తుగా కిమ్ జాంగ్ ఉన్‌లో ఈ మార్పురావడానికి కారణం ఏమై ఉంటుందాని ప్రపంచ దేశాలన్నీ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాయి. కానీ ఉత్తరకొరియా నియంత మాత్రం గుట్టుచప్పుడుకాకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. అవును, పైకి ఎన్ని మాటలు చెప్పినా కిమ్ జాంగ్ ఉన్ తలంపులు వేరు. ఆయనది ఎప్పుడూ మాయోపాయమే! ఒకవైపు తన దేశ క్రీడాకారులను దక్షిణకొరియాలో ఒలింపిక్స్‌కు పంపుతూనే మరోవైపు దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌లో బల ప్రదర్శన ఏర్పాట్లు చేయమంటూ మిలిటరీ అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు.

మిలిటరీ పరేడ్ యాదృచ్ఛికమా? ఎత్తుగడా?

మిలిటరీ పరేడ్ యాదృచ్ఛికమా? ఎత్తుగడా?

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న ఉత్తరకొరియాలో సైన్యం వార్షికోత్సవాలను నిర్వహించడం పరిపాటి. ఈ వార్షికోత్సవాల సందర్భంగా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో భారీ ఎత్తున మిలిటరీ పరేడ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ఉత్తరకొరియా సైన్యం తన 70వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకోనుంది. అయితే దేశాధినేత కిమ్ ఉన్నట్లుండి ఈ సైన్యం వార్షికోత్సవం తేదీని మార్చిపారేశారు. ఫిబ్రవరి 8న పెద్ద ఎత్తున మిలిటరీ పరేడ్ జరపమంటూ తన దేశ మిలిటరీ అధికారులను ఆదేశించారు. ఇది దక్షిణ కొరియాలో శీతాకాల ఒలింపిక్స్ ప్రారంభం కావడానికి ఒక్క రోజు ముందు కావడం యాదృచ్ఛికమా? లేక లిటిల్ రాకెట్‌మ్యాన్ వేసిన ఎత్తుగడా?

English summary
South Korea's Unification Minister said on Friday (Jan 26) that North Korea may stage a "threatening" military parade to mark its new military anniversary on Feb 8, the day before the start of the Winter Olympics, South Korea's Yonhap news agency said.North Korea announced on Tuesday it would celebrate the founding of its military on Feb 8, which is typically marked with a large military parade.Minister Cho Myoung-gyun said in a lecture in Seoul that the North is preparing an anniversary event in Pyongyang involving "large-scale" military forces and weapons, Yonhap said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X