వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాటర్ ల్యాండింగ్: చరిత్ర సృష్టించిన నాసా: భూమిపై వ్యోమగాములు: స్పేస్‌ఎక్స్ క్యాప్సుల్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష ప్రయోగ కేంద్రం నాసా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఓ కమర్షియల్ క్యాప్సుల్ ద్వారా స్పేస్ స్టేషన్ నుంచి ఇద్దరు వ్యోమగాములను భూమి మీదికి తీసుకొచ్చింది. అంతరిక్ష ప్రయోగాల్లో అనూహ్య రికార్డులను సాధిస్తోన్న ప్రైవేటు సంస్థ స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్యాప్సుల్ క్రూ డ్రాగన్ ఎండీవర్ ద్వారా నాసా అంతరిక్ష పరిశోధకులు డగ్ హార్లే, బాబ్ బెన్‌కీన్ భూమిని చేరుకున్నారు. ఎలాన్ మస్క్‌కు చెందిన సంస్థ ఇది.

ఏ ఒక్కర్నీ వదిలేలా లేదే? కరోనా బారిన పడ్డ కర్ణాటక ముఖ్యమంత్రి: ఆసుపత్రికి: బెంగళూరులో 60 వేలకుఏ ఒక్కర్నీ వదిలేలా లేదే? కరోనా బారిన పడ్డ కర్ణాటక ముఖ్యమంత్రి: ఆసుపత్రికి: బెంగళూరులో 60 వేలకు

45 సంవత్సరాల తరువాత వాటర్ ల్యాండింగ్..


అమెరికా కాలమానం ప్రకారం.. వారిద్దరూ మధ్యాహ్నం 2:48 నిమిషాలకు ఫ్లోరిడా సమీపంలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో వద్ద పెన్సాకోలా జలాల్లో దిగారు. 45 సంవత్సరాల తరువాత నాసా తొలిసారిగా స్ప్లాష్‌డౌన్‌ను నిర్వహించింది. అది విజయవంతమైంది. 1975లో అపోలో-సూయోజ్ మిషన్ ద్వారా నాసా తొలిసారిగా స్ప్లాష్‌డౌన్ నిర్వహించింది. ఆ తరువాత ఇదే తొలిసారి. అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి భూమికి వచ్చిన వ్యోమగాములు వాటర్ ల్యాండింగ్‌ను చేపట్టింది.

ట్రంప్ హర్షం..

స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ క్షేమంగా భూమిని చేరడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. రెండు నెలల మిషన్‌ను నాసా విజయవంతంగా ముగించిందని ట్రంప్ ట్వీట్ చేశారు. స్పైస్‌ఎక్స్ మిషన్ చీఫ్ మైక్ హీమెన్ వ్యోమగాములను స్వాగతం పలికారు. కమర్షియల్ క్యాప్సుల్ ద్వారా వ్యోమగాములు క్షేమంగా భూమికి చేరడం.. అంతరిక్ష ప్రయోగాల్లో ఓ కీలక మలుపుగా భావిస్తున్నారు. దీనికి కారణం- వచ్చే ఏడాది పర్యాటకులను స్పేస్‌ఎక్స్ క్రూ అంతరిక్షంలోకి తీసుకెళ్లాలని భావిస్తుండటమే.

28 వేల కిలోమీటర్ల ఆర్బిట్ స్పీడ్‌తో


28 వేల కిలోమీటర్ల ఆర్బిట్ స్పీడ్‌తో

అంతరిక్ష కేంద్రం నుంచి..

అంతరిక్ష కేంద్రం నుంచి..

అంతరిక్ష కేంద్రం నుంచి ఇద్దరు వ్యొమగాములను తీసుకుని బయలుదేరిన స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ గంటకు 560 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొచ్చింది. దీని ఆర్బిటల్ స్పీడ్ 28 వేల కిలోమీటర్లు. ఆర్బిటల్‌లోకి ప్రవేశించే సమయంలో గరిష్ఠ స్థాయిలో 1900 డిగ్రీల సెల్సియస్ మేర వేడిని ఎదుర్కొంది ఈ క్యాప్సుల్. గల్ప్ ఆఫ్ మెక్సికో జలాల్లో దిగుతున్న విషయాన్ని ముందే నిర్దేశించడంతో ఆ ప్రదేశానికి డాక్టర్లు, నర్సులతో కూడిన 40 సిబ్బందిని పంపించారు. ఆ వెంటనే వారిని కరోనా పరీక్షలను నిర్వహించారు.

ఎడారి ప్రాంతాలకు బదులుగా..

ఎడారి ప్రాంతాలకు బదులుగా..

సాధారణంగా అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చే క్యాప్సుల్స్‌ భూ ఉపరితలంపై ల్యాండింగ్ చేస్తుంటుంది నాసా. కజక్‌స్థాన్‌లోని ఎడారి ప్రాంతాలను దీనికి ఎంచుకుంటూ ఉంటుంది. దీనికి భిన్నంగా వాటర్ ల్యాండింగ్‌కు పూనుకుంది. ఓ ప్రైవేటు క్యాప్సుల్‌ ద్వారా తన వ్యొమగాములను భూమికి తీసుకుని రావడం కూడా ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భవిష్యత్తులో చేపట్టబోయే పర్యాటక సహిత ప్రయోగాలను దృష్టిలో ఉంచుకునే వాటర్ ల్యాండింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

English summary
Two NASA astronauts returned to Earth on Sunday in a dramatic, retro-style splashdown, their capsule parachuting into the Gulf of Mexico to close out an unprecedented test flight by Elon Musk's SpaceX company. It was the first splashdown by US astronauts in 45 years, with the first commercially built and operated spacecraft to carry people to and from orbit. The return clears the way for another SpaceX crew launch as early as next month and possible tourist flights next year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X