వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ 12 నిమిషాలు.. అంతరిక్షంలో కొత్త శకం.. ఈ రాత్రికే లైవ్.. స్పేస్‌ఎక్స్ ఘనతను ఇలా చూడొచ్చు..

|
Google Oneindia TeluguNews

అనంతంగా విస్తరించిన అంతరిక్షంలో.. అన్వేషణకు సంబంధించి ఇదొక చరిత్రాత్మక రోజు. సంప్రదాయాలను సవరించాలనుకునే ఔత్సాహికులకు శుభదినం. పేరుకు ఇది సాదాసీదా అంతరిక్ష ప్రయోగమే కావచ్చు.. ఏళ్లుగా కొనసాగుతున్నట్లే.. మరో ఇద్దరు వ్యోమగాములు స్పేస్ లోకి వెళ్లే అతి సాధారణ ప్రక్రియే కావొచ్చు.. వాళ్లను పంపుతున్నది కూడా ప్రఖ్యాత నాసా సంస్థే కావొచ్చు.. కానీ ఆస్ట్రోనాట్లు ప్రయాణించే క్యాప్సుల్ మాత్రం ఓ కలల వీరుడిది.

తొలిసారి ఇలా..

తొలిసారి ఇలా..

అవును, ఇప్పటిదాకా ప్రభుత్వాల ఆధ్వర్యంలో మాత్రమే జరిగిన మానవసహిత అంతరిక్ష ప్రయోగాలు.. తొలిసారి ఓ ప్రైవేటు కంపెనీ ‘స్పేస్‌ ఎక్స్' చేపట్టింది. ప్రస్తుతానికి ఇదంతా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అయినప్పటికీ.. రాబోయే రోజుల్లో అంతరిక్ష ప్రయోగాల్లో పెట్టుబడులు విస్తరించేందుకు, కొత్త అణ్వేషణలు జరిపేందుకు.. సామాన్యుడు సైతం తక్కువ ఖర్చుతో స్పేస్ లోకి వెళ్లగలిగేందుకు ఘట్టం దోహదపడుతుందని నిపుణులు అంటన్నారు.

ఆపరేషన్ డెమో-2

ఆపరేషన్ డెమో-2

బడా వ్యాపారి, ఆవిష్కర్త ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ‘స్పేస్ ఎక్స్' సంస్థ రూపొందించిన ‘క్రూ డ్రాగన్' అనే మానవసహిత క్యాప్సుల్ ను బుధవారం రాత్రి ప్రయోగించనున్నారు. ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ‘క్రూ డ్రాగన్' లో కూర్చునే ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలోకి పంపనున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ఆధ్వర్యంలో ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. స్పేస్ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడంలో భాగంగా స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్(యజమాని జెఫ్ బెజోన్), బోయింగ్ సీఎస్టీ-100 స్టార్ లైనర్ లాంటి కంపెనీలకు నాసా భారీ ప్రాజెక్టులు అప్పగించింది. అలా స్పేస్ ఎక్స్ సంస్థ డెమో-2 పేరుతో ఏళ్లపాటు శ్రమించి చివరికి ‘క్రూ డ్రాగన్' క్యాప్సుల్ ను సిద్ధం చేసింది.

రాత్రి 2 గంటలకు..

రాత్రి 2 గంటలకు..

స్సేస్ ఎక్స్ రూపొందించిన వాహక నౌక.. భూవాతావరణాన్ని దాటి అంతరిక్ష కక్ష్యలోకి చేరడానికి 12 నిమిషాల సమయం పడుతుంది. ఆ గడువు విజయవంతంగా ముగిస్తే.. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపిన మొదటి ప్రైవేటు సంస్థగా స్పేస్ ఎక్స్ నిలువనుంది. అంతేకాదు.. సుదీర్ఘ విరామం తర్వాత అమెరికా సొంత గడ్డపై చేపట్టిన ప్రయోగంగానూ రికార్డుకు ఎక్కనుంది. సానా చివరిసారిగా 2011లో మానవరహిత ప్రయోగాన్ని నిర్వహించింది. ఆ తర్వాత రకరకాల కారణాలతో తన వ్యోమగాముల్ని సైతం రష్యాలోని పరిశోధనా కేంద్రాల నుంచే రోదసీలోకి పంపింది. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 2:03కు(తెల్లవారితే గురువారం) ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి వ్యోమగాములు నింగిలోకి దూసుకుపోనున్నారు. ఈ కార్యక్రమాన్ని నాసా, స్పేస్ ఎక్స్ వెబ్ సైట్లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో లైవ్ కవరేజీ చూడొచ్చు.

Recommended Video

Vodafone Planning To Start 4G Network On Moon
కుదరకపోతే ప్లాన్-బీ

కుదరకపోతే ప్లాన్-బీ


ఒక వేళ వాతావరణం అనుకూలించకపోతే, ప్రయోగాన్ని ఈ నెల 30 లేదా 30న చేపడతామని నాసా, స్సేస్ ఎక్స్ ముందే ప్రకటించాయి. ప్రైవేటు సంస్థ త్వారా అంతరిక్షంలోకి వెళుతోన్న ఇద్దరు వ్యోమగాముల పేర్లు రాబర్ట్ బెంకన్, డగ్లస్ హర్లే రెడీ. వీళ్లిద్దరికీ గతంలో స్పేస్ లో గడిపిన అనుభవముంది. ఇప్పుడు స్పేస్ లోకి, రాబోయే రోజుల్లో చంద్రుడిపైకి.. ఆ తర్వాత మార్స్ పైకి వెళ్లేందుకూ ప్రణాలికలు సిద్ధం చేస్తున్నట్లు స్పేస్ ఎక్స్ సంస్థ తెలిపింది.

English summary
SpaceX is set to mark mark a new era in human space exploration, with a first-ever crewed spaceflight set to take off from Cape Canaveral in Florida. It will take just 12 minutes to reach its initial orbit, but the mission has been almost a decade in the making.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X