వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతరిక్షంపై ఇక ప్రైవేటు ఆధిపత్యం: మానవ సహిత ప్రయోగం సూపర్ సక్సెస్: డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్

|
Google Oneindia TeluguNews

ఫ్లోరిడా: అంతులేని అద్భుతాలకు, అంతే తెలియని ఖగోళ వింతలకు ఆలవాలమైన అంతిరిక్షంపై ఆధిపత్యాన్ని చలాయించడానికి ఓ ప్రైవేటు సంస్థ శ్రీకారం చుట్టింది. ఓ ముందడుగు వేసింది. మానవ సహిత ప్రయోగంలో ఘన విజయాన్ని అందుకుంది. ఈ ప్రయత్నం ఒకట్రెండు సార్లు బెడిసి కొట్టినా బెదిరి పోలేదు. వెనకడుగు వేయలేదు. మళ్లీ మళ్లీ ప్రయత్నించింది. సూపర్ సక్సెస్ అయింది. అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకుంది. అదే స్పేస్ఎక్స్.

Recommended Video

SpaceX Successfully Launches Nasa Astronauts Into Orbit

నాసా వ్యోమగాములు..

సాధారణంగా అంతరిక్షంలోకి ప్రయోగించే వాహక నౌకలు గొట్టం రూపంలో ఉంటాయి. దీనికి భిన్నంగా షిప్ డిజైన్‌లో దీన్ని రూపొందించారు స్పేస్ఎక్స్ శాస్త్రవేత్తలు. దీర్ఘ చతురస్రాకారంలో ఉండేలా ఈ కాప్సుల్‌ను తయారు చేశారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన ఇద్దరు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించారు. రాబర్ట్ బెహ్న్‌కెన్, డగ్లస్ హర్లీ అనే నాసా వ్యోమగాములు ఈ స్పేస్ క్యాప్సుల్ ద్వారా అంతరిక్షంలోకి దూసుకెళ్లారు. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు వారు చేరుకోవాల్సి ఉంటుంది.

ఫ్లోరిడా నుంచి ప్రయోగం..

అమెరికాలోని ఫ్లోరిడాలోని కేప్ కెనరావెల్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి స్పేస్ఎక్స్‌ సంస్థకు చెందిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ కేవ్ కానవెరాల్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. గ్రీన్‌విచ్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:22 నిమిషాలకు ఈ స్పేస్‌క్రాఫ్ట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఆ కాస్సేపటికే ఈ ప్రయోగం విజయవంతమైనట్లు స్పేస్ఎక్స్ సంస్థ ప్రకటించింది. కాలిఫోర్నియాలోని హాథ్రోన్‌లో గల మిషన్ కంట్రోల్ రూమ్ నుంచి ఆ సంస్థ శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని చేపట్టారు.

రెండుమార్లు వాయిదా..

నిజానికి ఈ ప్రయోగం ఇదివరకే పూర్తి కావాల్సి ఉంది. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల రెండుసార్లు వాయిదా పడింది. మూడోదశ కౌంట్‌డౌన్ విజయవంతమైంది. తొలి మానవ సహిత ప్రయోగం విజయవంతం కావడం పట్ల స్పేస్ఎక్స్ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్షంలోకి మానవ సహిత ప్రయోగంతో సరికొత్త చరిత్రను లిఖించే అవకాశం దక్కిందని అన్నారు. తాను కన్న కలలు నిజం అయ్యాయని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులోనూ ఇవే తరహా ప్రయోగాలను కొనసాగిస్తామని చెప్పారు. అంతరిక్షంలోకి ప్రవేశించాలనే భావించే ప్రైవేటు సంస్థలకు బాటలు వేశామని అన్నారు.

ప్రత్యక్షంగా వీక్షించిన ట్రంప్..

ఈ ప్రయోగాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగా వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తొలిసారిగా తాను ఇలాంటి ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించానని, థ్రిల్ కలిగించిందని వ్యాఖ్యానించారు. అమెరికా అంతరిక్ష ప్రయోగాల్లో ఓ సరికొత్త అధ్యాయం ఆరంభమైందని అన్నారు. తాము క్షేమంగా ఉన్నట్లు నాసా వ్యోమగాములు సందేశాన్ని పంపించారని, ఈ ప్రయోగానికి తాను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నానని చెప్పారు.

English summary
A rocket ship designed and built by Elon Musk’s SpaceX company has lifted off with two NASA astronauts on a history-making flight to the International Space Station. The mission was supposed to be launched on May 27 but it was delayed due to adverse weather conditions at the last minute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X