వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెల్త్ అలర్ట్ : మరో అంత్రాక్స్ వ్యాధి..ఇది ఈ జంతుమాంసం నుంచి పుట్టుకొస్తోందట..!

|
Google Oneindia TeluguNews

స్పెయిన్ : స్పెయిన్ అంత్రాక్స్ తరహాలాంటి వ్యాధితో అట్టుడికిపోతోంది. ఈ వ్యాధిపేరు లిస్టీరియాసిస్. ఇది ఓ మాంసపు కంపెనీ నుంచి వ్యాప్తి చెందింది. ఈ వ్యాధి ఇప్పటికే 150 మందికి సోకగా... అందులో ఒకరు మృతి కూడా చెందారు. దీంతో స్పెయిన్ ప్రభుత్వం ప్రమాద ఘంటికలను మోగించింది. దేశవ్యాప్తంగా హెల్త్ అలర్ట్‌ను ప్రకటించింది. అంతేకాదు స్పెయిన్‌లో పర్యటించిన ఇతర విదేశీయులకు కూడా ఈ వ్యాధి సోకి ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేసింది. స్పెయిన్‌లో పర్యటించిన సమయంలో ఇన్‌ఫెక్షన్ సోకిన ఉత్పత్తులను తీసుకుని ఉంటే అలాంటి వారికి కచ్చితంగా వ్యాధి సోకి ఉంటుందన్న అనుమానంను వైద్యులు వ్యక్తపరిచారు.

ఇక లిస్టీరియాసిస్ వ్యాధి మూలాలు పందిమాంసంలో కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. పందిమాంసంను స్పెయిన్‌లో కార్న్‌మెకాడాగా పిలుస్తారు. ఒక్క దక్షిణ స్పెయిన్‌లోనే 132 లిస్టీరియాసిస్ కేసులు బయటపడినట్లు తెలుస్తోంది. చాలామందిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని అయితే పరీక్షలు జరిపితే కానీ అసలు విషయం బయటపడదని చెప్పారు.

Spain issues international health alert over listeriosis outbreak

మొత్తం 53 మంది హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతుండగా... ఇందులో 23 మంది గర్భవతులు ఉన్నారని అధికారులు తెలిపారు. అంతేకాదు గర్భంలో ఉన్న మరో శిశువుకు కూడా ఈ వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు. జూలైలో తల్లి ఓ బార్‌లో పందిమాంసం తీసుకుందని ఇన్ఫెక్షన్ కడుపులో ఉన్న బిడ్డకు సోకిందని చెప్పారు.

Spain issues international health alert over listeriosis outbreak

ఇక లిస్టీరియాసిస్ వ్యాధి సోకితే... మనిషికి విపరీతమైన తలనొప్పి, ఎన్సీఫాలిటిస్ లక్షణాలు బయటపడతాయని చెప్పారు. అయితే ఈ వ్యాధి ఎక్కువగా చిన్నపిల్లల్లో పెద్ద వయసున్న వారిలో వస్తుందని వైద్యులు తెలిపారు. అంతేకాదు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో కూడా లిస్టీరియాసిస్ వ్యాధి సోకుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇన్‌ఫెక్షన్ సోకిందంటే గ్యాస్ సమస్యలతో పాటు జ్వరం కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఇది ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా పాకుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇక రంగంలోకి దిగిన ప్రభుత్వం ఏ సంస్థ నుంచి మార్కెట్‌లోకి పందిమాంసం బయటకు వెళ్లిందో తిరిగి ఆ స్టాక్‌ను వెనక్కు తెప్పించారు.

English summary
An outbreak of listeriosis in Spain caused by meat produced by a firm in the southern Spanish province of Seville is now having international repercussions. The country’s Health Ministry has activated alert “given the possibility that cases might be detected in other countries.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X