వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదీ చైనా దుర్నీతి?: దురాక్రమణే ధ్యేయంగా పావులు.. భారత్ వ్యూహమేంటో?

చైనా ఎత్తుగడ వెనుక దక్షిణ చైనా సముద్రంపై పట్టుబిగించాలన్న వ్యూహం ఉందని అమెరికా ఇప్పటికే అభిప్రాయపడిన నేపథ్యంలో.. ఆ దేశ దురాక్రమణలపై మరోసారి చర్చ జరుగుతోంది.

|
Google Oneindia TeluguNews

బీజింగ్: సిక్కీం సరిహద్దులోని భూటాన్ ట్రై జంక్షన్ వద్ద భారత్-చైనాల వివాదం గత 50రోజులుగా రగులుతూనే ఉంది. తమకూ భూటాన్ కు మధ్య వివాదంలోకి భారత్ ప్రవేశించడాన్ని చైనా తీవ్రంగా నిరసిస్తోంది. ఓవైపు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటామంటూనే.. ఇక ఓపిక నశించిందని 'యుద్ద' సంకేతాలూ పంపిస్తోంది.

భారత్ విషయంలో మొండిగా వెళ్తే అంతే: చైనాకు ఆ దేశ స్కాలర్ హెచ్చరిక?భారత్ విషయంలో మొండిగా వెళ్తే అంతే: చైనాకు ఆ దేశ స్కాలర్ హెచ్చరిక?

ట్రై జంక్షన్ వద్ద చైనా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణం ఈశాన్య భారతంతో తమ సంబంధాలను బలహీనపరుస్తుందని భారత్ వాపోతోంది. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ విషయంలో తాము కల్పించుకోవాల్సి వచ్చిందని భారత్ అభిప్రాయపడుతోంది.

కబళించే ఎత్తుగడ: ఇండియాపై చైనా దూకుడు వెనుక.. ఇదీ అసలు కుట్ర?కబళించే ఎత్తుగడ: ఇండియాపై చైనా దూకుడు వెనుక.. ఇదీ అసలు కుట్ర?

వివాదాన్ని ఇంత పెద్దదిగా మార్చడంలో.. చైనా మీడియా కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. చైనా ఎత్తుగడ వెనుక దక్షిణ చైనా సముద్రంపై పట్టుబిగించాలన్న వ్యూహం ఉందని అమెరికా ఇప్పటికే అభిప్రాయపడిన నేపథ్యంలో.. ఆ దేశ దురాక్రమణలపై మరోసారి చర్చ జరుగుతోంది.

టిబెట్‌ను వశపరుచుకుని:

టిబెట్‌ను వశపరుచుకుని:

1949లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) అధికారం దక్కించుకున్నప్పటి నుంచి చైనా దురాక్రమణలు మొదలయ్యాయి. మావో జెడాంగ్ నాయకత్వంలో సీపీసీ అధికారం దక్కించుకున్న తర్వాత.. కొద్ది నెలల్లోనే చైనా దురాక్రమణలు మొదలయ్యాయి.

అలా చైనా దృష్టి పొరుగునే ఉన్న టిబెట్ పై పడింది. బౌద్ద మతగురువుల పాలనలో స్వతంత్ర దేశంగా ఉన్న టిబెట్ ను చైనా బలవంతంగా ఆక్రమించింది. టిబెట్ లోని 12లక్షల చదరపు కి.మీ భూభాగాన్ని తమలో కలిపేసుకుంది. టిబెట్ పీఠభూమికి పశ్చిమం వైపు ఉన్న షిన్జియాంగ్ ప్రాంతంలోని 16లక్షల చదరుపు కి.మీ కూడా ఆక్రమించింది. దీంతో చైనా విస్తీర్ణం రెట్టింపయింది.

డోక్లామ్‌లో అసలేం జరుగుతోంది?: 'యుద్దం'పై అమెరికా హెచ్చరిక.. ఏ క్షణంలో అయినాడోక్లామ్‌లో అసలేం జరుగుతోంది?: 'యుద్దం'పై అమెరికా హెచ్చరిక.. ఏ క్షణంలో అయినా

Recommended Video

Sikkim standoff: Feasible solution to end standoff between India
అరుణాచల్‌పై కన్ను:

అరుణాచల్‌పై కన్ను:

నిజానికి చైనా చాలాకాలంగా అరుణాచల్ ప్రదేశ్ పై కన్నేసింది. ప్రస్తుతం భూటాన్ ట్రై జంక్షన్ వద్ద కొనసాగుతున్న వివాదంలోను చైనా ఇదే దుర్బుద్దితో దుందుడుకుగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయాలున్నాయి.

కాగా, 1962లో అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్ తమవేనని వాదిస్తూ భారత్ తో చైనా యుద్దానికి దిగింది. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ ప్రాంతాన్ని ఆక్రమించింది. అయితే యుద్దం ముగిశాక.. తిరిగి ఆ ప్రాంతాన్ని భారత్ కు ఇచ్చేసింది.

మెక్ మోహన్ రేఖను గౌరవిస్తున్నట్లు ప్రకటించిన చైనా.. 37,224చదరుపు కి.మీ విస్తీర్ణం కలిగిన అక్సాయ్ చిన్ ను మాత్రం తమ దేశంలో కలిపేసుకుంది. నిజానికి 1957లోనే చైనా అక్సాయ్ చిన్ లో రోడ్డును నిర్మించింది. దీన్ని గుర్తించడంలో భారత నిఘా వర్గాలు పూర్తిగా విఫలమయ్యాయన్న విమర్శ ఉంది. ఆ తర్వాత 1993లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు అక్సాయ్ చిన్ పై చైనా నియంత్రణను పరోక్షంగా అంగీకరిస్తూ వాస్తవధీన రేఖను భారత్ గుర్తించింది.

చైనా దురాక్రమణ కాంక్ష ఎప్పటికైనా భారత భూభాగాన్ని కబళించాలన్న రీతిలో ఉండటంతో.. దీనికి శాశ్వత పరిష్కారాన్ని వెతకడంలో భారత్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

దక్షిణ చైనా సముద్రాన్ని ఆక్రమించాలని:

దక్షిణ చైనా సముద్రాన్ని ఆక్రమించాలని:

చైనా విస్తరణ కాంక్షలో భాగంగా దాని కన్ను ప్రధానంగా దక్షిణ చైనా సముద్రంపై పడింది. దీన్ని వశపరుచుకుంటే అపారమైన సహజ వనరుల నిక్షేపాల్ని గుప్పిట్లో బంధించవచ్చనేది చైనా ఎత్తుగడ.

అయితే దక్షిణ చైనా సముద్రానికి సరిహద్దులో ఉన్న ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై, ఇండోనేషియా, సింగపూర్, వియత్నాం మాత్రం చైనా ప్రయత్నాలను తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

అయితే ఎవరెంత వాదించినా వెనక్కి తగ్గని చైనా మాత్రం.. సముద్రం వెంట కృత్రిమ దీవులను నిర్మించి వాటిని సైనిక స్థావరాలుగా మార్చేందుకు వ్యూహం పన్నింది.

తూర్పు చైనా సముద్రంపై కూడా:

తూర్పు చైనా సముద్రంపై కూడా:

దక్షిణ చైనా సముద్రంతో పాటు తూర్పు సముద్రంలో దీవులపై కూడా డ్రాగన్ కన్ను పడింది. ఇప్పటికే తూర్పు చైనా సముద్రంలోని పలు దేశాల పరిధిలో ఉన్న దీవులను బలవంతంగా లాగేసుకుంది. వియత్నాం ఆధీనంలో ఉన్న పారాసెల్ దీవులను 1974లో, జాన్సన్ రీఫ్ ను 1988లో, మిస్చీఫ్ రీఫ్ ను 1995లో చేజిక్కించుకుంది. 2012లో ఫిలిప్పీన్స్ నుంచి స్కారోబొరో షోల్ ను ఆక్రమించుకుంది.

English summary
China has told India that the special envoys of the two countries on border issues have no role to play in resolving the Doklam standoff, two people familiar with the developments said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X