వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐసిస్ ఎఫెక్ట్, తిప్పలు: పేరు మార్చుకున్న పాఠశాల

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: ఉగ్రవాద భయంతో లండన్‌లో మూడేళ్లుగా కొనసాగుతున్న ఓ ప్రత్యేక అవసరాల పిల్లల పాఠశాల పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పాఠశాల పేరు 'ది ఐసిస్ అకాడమీ'. ఐసిస్ అని ఉండటంతో పేరు మార్చుకోవాల్సి వచ్చింది.

ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థను కూడా ఐసిస్‌ అని వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పాఠశాల పేరు మార్చాల్సి వచ్చింది. మానసిక సమస్యలు, ఆటిజం, ఇతర వైకల్యాలు ఉన్న పిల్లల కోసం మూడేళ్ల క్రితం 'ది ఐసిస్‌ అకాడమీ' పేరుతో పాఠశాలను ఏర్పాటు చేశారు.

ఆక్స్‌ఫర్డ్‌లో ఈ పాఠశాల సమీపంలో థేమ్స్‌ నది పాయ ఐసిస్‌ ప్రవహిస్తుంటుంది. దాని పేరు మీదే పాఠశాలకు ఐసిస్‌ అకాడమీ అనే పేరు పెట్టారు. అయితే ఇప్పుడా పేరు కారణంగా పాఠశాలకు నెగెటివ్‌ రిమార్క్స్‌ రావడంతో అకాడమీ ప్రధానోపాధ్యాయురాలు కే విల్లెట్‌ ఇటీవల పేరును 'ద ఇఫ్లే అకాడమీ'గా మార్చారు.

Special School Called Isis In UK Forced To Change Name

ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ పేరు కారణంగా పాఠశాలలో ఉగ్రవాదులను తయారు చేస్తున్నారా? అని ఆన్‌లైన్‌లో తీవ్రమైన వ్యాఖ్యలు వస్తున్నాయని, ఇంటర్నెట్‌లో స్కూల్‌ పేరు సెర్చ్‌ చేస్తే ఉగ్రవాదుల ఫొటోలు వస్తున్నాయని అందుకే స్కూల్‌పై ప్రజల్లో సందిగ్ధత తొలగించడానికి పేరు మారుస్తున్నట్లు కే విల్లెట్‌ తెలిపారు.

ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన ఈ పాఠశాల గురించి తెలిస్తే ఎవ్వరూ అలా మాట్లాడరన్నారు. పాఠశాలలో 132 మంది ప్రత్యేక అవసరాలున్న చిన్నారులు ఉన్నారని చెప్పారు. తమ పాఠశాల వాతావరణం గురించి ఒకసారి తెలిస్తే మరోసారి ఎవరూ మాట్లాడరని, కానీ తెలియని వాళ్లు మాట్లాడుతున్నారని చెబుతున్నారు.

English summary
A special school in the UK called 'The Isis Academy' has been forced to change its name after jibes about pupils being trained as 'terrorists'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X