వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదేందబ్బా : బల్లిని మించిన స్పీడ్.. స్పైడర్‌లా దూకుడు.. యువతి రికార్డు బ్రేక్

|
Google Oneindia TeluguNews

ఇండోనేషియా : సహజంగా గోడమీద బల్లులు పాకుతుంటాయి. ఇక స్పైడర్ మ్యాన్‌ల గురించి వేరే చెప్పనక్కర్లేదు. గోడ మీద బల్లులు అలా సరసరా పాకుతుంటే వాటి వేగం అంచనా వేయడం కుదరదు. అలాగే స్పైడర్లు కూడా గోడలు పాకడం చూస్తుంటే రెండు కళ్లు చాలవు. అదే క్రమంలో ఇండోనేషియాకు చెందిన ఓ యువతి గోడ అలా అలా స్పీడ్‌గా పాకుతూ రికార్డు బ్రేక్ చేయడం చర్చానీయాంశమైంది. ఆ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఎరీస్ సుసంతి రహయు అనే ఇండోనేషియా యువతి వాల్ క్లైంబింగ్‌లో రికార్డు బద్దలు కొట్టింది. 15 మీటర్ల గోడను కేవలం 7 సెకన్ల లోపు సరసరా పాకేసింది. బల్లిని మించిన స్పీడ్‌లా.. స్పైడర్‌ను మించిన వేగంలా ఆ యువతి స్టన్నింగ్ యాక్షన్ చూసి అక్కడి వీక్షకులకు క్రీడానందం కలిగింది. అలా అలా పాకుతూ కేవలం 7 సెకన్ల లోపే 15 మీటర్ల ఎత్తున్న గోడ పైకి చేరడం అందర్నీ అబ్బురపరిచింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండంతో వారెవ్వా అంటున్నారు నెటిజన్లు.

Spiderwoman breaks womens climbing speed record break

స్పైడరే పాకుతుందా అనే రేంజ్‌లో అత్యంత వేగంగా 15 మీటర్ల గోడను పాకి పాత రికార్డులను తిరగరాసింది సుసంతి రహయు. చైనాలోని క్సియమెన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్పోర్ట్ క్లైంబింగ్ (IFSC) పోటీలో పాల్గొని ప్రపంచ కప్ కొట్టేసింది. మహిళల విభాగంలో ఈ అథ్లెట్ సాధించిన సరికొత్త రికార్డు ఔరా అనిపిస్తోంది. 15 మీటర్ల గోడను 6.995 సెకన్లలో ఎక్కేసి పోటీదారులను తోసిరాజని రికార్డు బ్రేక్ చేసింది.

అమ్మకు ప్రేమతో.. స్కూటర్‌పై తీర్థయాత్ర.. ఆనంద్ మహీంద్రా కారు గిఫ్ట్..! (వీడియో)అమ్మకు ప్రేమతో.. స్కూటర్‌పై తీర్థయాత్ర.. ఆనంద్ మహీంద్రా కారు గిఫ్ట్..! (వీడియో)

ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఆమె చేతికి వేలి గాయమైన ఏమాత్రం లెక్క చేయలేదు. ఓన్లీ స్పోర్టివ్ మైండ్‌తో పోటీలో పాల్గొని ప్రపంచ రికార్డును సొంతం చేసుకోగలిగింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెను స్పైడర్‌వుమెన్‌గా పిలుస్తున్నారు. అంతేకాదు పోస్ట్ చేసిన క్షణాల్లోనే దాదాపు 5 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం.

English summary
At last weekend's International Federation of Sport Climbing (IFSC) World Cup, Indonesia’s Aries Susanti Rahayu, aka "Spiderwoman," broke the women's speed climbing record previously set in April by her competitor, China’s Song Yiling. In which climbers race to scramble a 15-meter wall, will be a new addition to the 2020 Tokyo Olympics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X