వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానంలో చిత్తుగాకొట్టుకున్న అమ్మాయిలు(వీడియో)

|
Google Oneindia TeluguNews

లాస్‌ఏంజిల్స్ : ఇద్దరు అమ్మాయిలు తాగిన మైకంలో పెద్ద శబ్దంతో మ్యూజిక్ ప్లే చేశారని ఆ విమానంలో ప్రయాణికులంతా హద్దులు మరచిపోయారు. జుత్తులు పీక్కుంటూ కొట్టుకున్న వారు ఆ విమానాన్ని రణరంగంగా మార్చారు.

బాల్డిమోర్ నుంచి లాస్ ఏంజిల్స్ వెళ్తున్న స్పిరిట్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 141లో ఈ ఘటన జరిగింది. ఆ విమానంలో ఇద్దరు మహిళలు బాగా మద్యం సేవించి ప్రయాణిస్తున్నారు. వాళ్ళిద్దరూ పెద్ద శబ్దంతో బూమ్‌బాక్స్‌లో మ్యూజిక్ ప్లే చేశారు.

Spirit Airlines passengers fight over loud 'boom box'

దీంతో ప్రయాణికులకు చిర్రెత్తింది. ఆ సౌండ్ తగ్గించండి మహాప్రభో అంటూ గోల పెట్టారు. కానీ వాళ్ళు వినలేదు. పైగా మరింత సౌండ్ పెంచి, బూమ్‌బాక్స్‌ను గాల్లో ఊపుతూ మ్యూజిక్ ప్లే చేశారు. ఈలోగా విమానం లాస్ ఏంజిల్స్‌లో దిగింది.

మరుక్షణంలో ఐదుగురు మహిళలు ఆ తాగుబోతు మహిళల దగ్గరకు దూసుకెళ్లారు. మొత్తం అంతా కలిసి జుత్తుల పీక్కుంటూ కొట్టుకున్నారు. ఒకరిమీద మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. విమానం అంతా అరుపులు, కేకలతో మారుమోగిపోయింది. కాగా ఈ తతంగాన్నంతా వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఘటనకు విస్తృత ప్రచారం దక్కింది.

English summary
A flight from Baltimore, Maryland, to Los Angeles quickly went sour Wednesday when five passengers got into a fist fight over loud music.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X