వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Hantavirus: చైనాలోనే పుట్టుకొచ్చిన మరో మహమ్మారి..హంటా వైరస్: ఒకరి బలి..పలువురిలో పాజిటివ్

|
Google Oneindia TeluguNews

బీజింగ్: ప్రాణాలను తోడేసే వైరస్‌లకు పుట్టినిల్లుగా తయారైనట్టుంది చైనా. వేలాదిమందిని బలి తీసుకుంటూ, ప్రపంచం మొత్తాన్నీ అల్లకల్లోలానికి గురి చేస్తోన్న కరోనా వైరస్ ఒకవంక విజృంభిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనే మరో సరికొత్త వైరస్ చైనాలో పుట్టుకొచ్చింది. దాని పేరే.. హంటా వైరస్. ఈ వైరస్ ఒకరిని బలి తీసుకుంది కూడా. మరో 32 మందిలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. వారందరూ ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటున్నారు. చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

షాన్డాంగ్ ప్రావిన్స్‌లో పుట్టుకొచ్చినట్టుగా అనుమానాలు..

షాన్డాంగ్ ప్రావిన్స్‌లో పుట్టుకొచ్చినట్టుగా అనుమానాలు..

చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌లో ఈ వైరస్ పుట్టుకొచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. షాన్డాంగ్ ప్రావిన్స్ నుంచి యునాన్ ప్రావిన్స్‌కు వచ్చిన ఓ వ్యక్తిలో హంటా వైరస్ లక్షణాలు కనిపించాయి. సుమారు 33 మంది ప్రయాణికులతో కూడిన ఒక బస్సు షాన్డాంగ్ ప్రావిన్స్ నుంచి యునాన్ ప్రావిన్స్‌కు చేరుకుంది. ఈ బస్సులో యునాన్‌కు చేరుకున్న ఓ ప్రయాణికుడు ఈ వైరస్ బారిన పడ్డాడు. వైరస్ లక్షణాలు వెలుగులోకి వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే అతను మరణించాడు.

ప్రయాణికులందరికీ పరీక్షలు.. పాజిటివ్‌గా

ఆ ప్రయాణికుడు మరణించిన తరువాత.. అదే బస్సులో ప్రయాణించిన వారందర్నీ స్థానిక అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది పరీక్షలు నిర్వహించగా..అందరిలోనూ పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఐసొలేషన్ వార్డుల్లో చేర్చారు. కరోనా వైరస్ రోగులు లేని వార్డుల్లో వారిని చేర్చారు. ఒకే సమయంలో రెండు రకాల వైరస్‌లకు వైద్య చికిత్సను అందించాల్సిన దుస్థితిని డాక్టర్లు ఎదుర్కొంటున్నారు.

లక్షణాలు బయటపడిన గంటల్లోనే మృతి

లక్షణాలు బయటపడిన గంటల్లోనే మృతి


ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడి అల్లాడుతోన్న చైనాలో ప్రాణాలను హరించేలా సరికొత్త హంటా వైరస్ వెలుగులోకి రావడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి. కరోనా వైరస్ బారిన పడి చైనాలో వేలాదిమంది మృత్యువాత పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 15 వేల మందికి పైగా కన్నుమూశారు. ఈ తరుణంలో హంటా వైరస్ విజృంభించడం సమస్యను మరింత సంక్లిష్టం చేసిందని అంటున్నారు. హంటా వైరస్ వెలుగులోకి వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే బాధితుడు మరణించడం కలకలం రేపుతోంది. దాని తీవ్రతను చాటుతోంది.

English summary
A person from Yunnan Province died while on his way back to Shandong Province for work on a chartered bus on Monday. He was tested positive for hantavirus. Other 32 people on bus were tested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X