• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రష్యా కరోనా వ్యాక్సిన్ వెనుక చంద్రబాబు? - ఆ అమ్మాయి పుతిన్ కూతురు కాదు - ‘స్పుత్నిక్-వి’ కోలాహలం

|

''ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా... వ్యాక్సిన్ దిగిందా? లేదా?'' అని ట్రంప్ బాబాయికి పుతిన్ చిచ్చా షాకిచ్చినట్లు.. మిగతా దేశాలన్నీ మీడియా ముందు ప్రకటనలు చేస్తుండగా రష్యా మాత్రం ఏకంగా టీకా బాటిల్ తో దూసుకొచ్చినట్లు.. పుతిన్ చేతిలో వ్యాక్సిన్ సీసాను చూసి కరోనా వైరస్ 'ఇక నా పని ఖతమైనట్లే'అని ఫీలవుతున్నట్లు... ఇలా ఒకటీ పదీ కాదు.. వేలల్లో మీమ్స్.. లక్షల్లో కామెంట్లు కురుస్తున్నాయి 'స్పుత్నిక్-వి' వ్యాక్సిన్‌పై. ప్రపంచంలోనే మొదటి కొవిడ్ వ్యాక్సిన్ గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం స్పుత్నిక్-వీని విడుదల చేశారు.

కరోనా బిగ్ న్యూస్: వ్యాక్సిన్ వచ్చేసింది - రష్యా రికార్డు - పుతిన్ కూతురికి మొదటి డోసు..

స్పుత్నిక్ వ్యాక్సిన్ ఇలా..

స్పుత్నిక్ వ్యాక్సిన్ ఇలా..

రష్యా తయారీ స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ను ప్రఖ్యాత గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, రష్యా ఆరోగ్య శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ టీకాను అందించడం ద్వారా మనుషుల్లో కరోనాను తట్టుకునే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న 21 రోజుల్లోనే రోగనిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది. రెండో డోసుతో ఇక కరోనా మనల్ని ఏమీ చేయలేని స్థితి ఏర్పడుంది. వచ్చే నెల నుంచి వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తామన్న పుతిన్.. వ్యాక్సిన్ ను ముందుగా డాక్టర్లు, టీచర్లకు అందజేస్తామని తెలిపారు. ఆయనీ ప్రకటన చదవడం పూర్తయిన మరుక్షణం నుంచే ఇంటర్నెట్ లో స్పుత్నిక్ కోలాహలం మొదలైంది.

చంద్రబాబునూ వదల్లేదు..

చంద్రబాబునూ వదల్లేదు..

అందరికంటే ముందు అమెరికానే కొవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తుందని, ముందుగా అమెరికన్లకు ఇచ్చిన తర్వాతే ప్రపంచ దేశాలకూ సప్లై చేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనల తాలూకు మీమ్స్ ఇవాళ హైలైట్ గా నిలిచాయి. తాబేలు, కుందేలు కథలా.. ప్రగల్భాలకు పోకుండా రష్యా తొలి వ్యాక్సిన్ ను సైలెంట్ గా తీసుకొచ్చిందంటూ నెటిజన్లు ప్రశంసించారు. ఇండియాకు సంబంధించి ‘‘గో కరోనా గో''నినాదం మరోసారి మారుమోగింది. రష్యన్ సైంటిట్లులకు అభినందనలు వెల్లువెత్తాయి. కాగా, తెలుగుకు సంబంధించిన కొన్ని మీమ్స్ లో టీడీపీ అధినేత చంద్రబాబు దర్శనమివ్వడం గమనార్హం. ‘‘చూశారా త‌మ్ముళ్లూ.. పుతిన్‌తో మ‌నం వ్యాక్సిన్ ఎలా త‌యారుచేయించామో..''అని చంద్రబాబు అంటున్నట్ల మీమ్స్, కామెంట్స్ వైరల్ అయ్యాయి. పాత్ బ్రేకింగ్ పనులెన్నో చేశానంటూ చంద్రబాబు చెప్పుకోవడంపై తరచూ విమర్శలు రావడం, ఇటీవలే హైదరాబాద్ నిర్మాణంపైనా వైసీపీ, టీడీపీ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న నేపథ్యంలో పుతిన్-బాబు మీమ్స్ కు ప్రాధాన్యం ఏర్పడింది.

రాజధానిపై ట్విస్ట్: అమరావతి ముహుర్తానికే విశాఖలో శంకుస్థాపన - మోదీ కోసం జగన్ గజయత్నం - అంతలోనే..

ఆమె పుతిన్ కూతురు కాదు..

ఆమె పుతిన్ కూతురు కాదు..

కరోనా విరుగుడు కోసం రష్యా రూపొందించిన స్పుత్నిక్ వ్యాక్సిన్ ను తన ఇద్దరు కూతుళ్లలో ఒకరికి అందించామని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రెసిడెంట్ పుతిన్ వెల్లడించారు. ఈ ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలైంది. ఎర్ర టీషర్ట్, బ్లూ షార్ట్స్ ధరించి వ్యాక్సిన్ డోస్ తీసుకున్న ఆ యువతిని పుతిన్ కూతురంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదు. ఆ వీడియోలోని అమ్మాయి వ్యాక్సిన్ డోసు తీసుకున్న వాలంటీరే అయినప్పటికీ, సదరు వీడియో నెల రోజుల కిందిటిదని వెల్లడైంది. అదీగాక, పుతిన్ ఇద్దరు కూతుళ్లూ (మారియా(35), కేథరిన్(33)) పెద్దవాళ్లే. పుతిన్ కూతురు కానప్పటికీ వ్యాక్సిన్ ట్రయల్స్ లో పాల్గొన్న ఆ వైరల్ అమ్మాయికి అభినందనలు చెప్పాల్సిందే.

  COVID-19 : Oxford Corona Vaccine ఈ ఏడాదిలోనే.. సీరం సీఈవో వెల్లడి ! || Oneindia Telugu
  స్పుత్నిక్-వీ సత్తా ఎంత?

  స్పుత్నిక్-వీ సత్తా ఎంత?

  వైరల్ వీడియోలు, ఫన్నీ మీమ్స్ తోపాటు రష్యన్ తయారీ ‘స్పుత్నిక్-వీ వ్యాక్సిన్'పై చాలా సీరియస్ చర్చలు, వాగ్వాదాలు కూడా నడుస్తున్నాయి. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండానే దీన్ని మార్కెట్లోకి తెస్తున్నారని, వేల మంది వాలంటీర్లపై నెలల తరబడి జరపాల్సిన టెస్టుల్లో నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ లోపే రష్యాకే చెందిన ఓ రీసెర్చర్.. అసలు తమ దేశ వ్యాక్సీన్లో ‘డేటా'అన్నది లేదని చెప్పడం సంచలనంగా మారింది. స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా ఆమోదం తెలపని వైనం కూడా అనుమానాలను రెట్టింపు చేస్తున్నది. అయితే, పుతిన్ మాత్రం ఈ వాదనను కొట్టిపారేశారు. స్పుత్నిక్ సత్తా ఏంటో ప్రపంచానికి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఆయన సొంత కూతురికే వ్యాక్సిన్ డోసు ఇప్పించినట్లు తెలుస్తోంది.

  English summary
  As Russia registered the first COVID-19 vaccine of the world on Tuesday, President Vladimir Putin's daughter became the first one to get inoculated. but, The Girl Receiving Covid-19 Vaccine in This Viral Video is Not Vladimir Putin’s Daughter.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X