యూఎస్ వ్యాక్సిన్ల కంటే చౌకగా మార్కెట్ లో స్పుత్నిక్ వీ .. రూ .740కే ఒక్కో డోసు.. 95 శాతం ప్రభావం
కరోనా మహమ్మారిని అంతం చేయడానికి వ్యాక్సిన్ ప్రయోగాలూ తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటికే వ్యాక్సిన్ ఫలితాలు సానుకూలంగా ఉన్నట్లుగా ఫైజర్, మోడర్నా కంపెనీల నివేదికలు వెల్లడించాయి. తాజాగా తాము తయారు చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కూడా 95 శాతం ప్రభావవంతంగా పని చేస్తోందని రష్యా ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ ధర ఒక డోసుకు అంతర్జాతీయ మార్కెట్లో 10 డాలర్లు అంటే సుమారు 740 రూపాయల లోపే ఉంటుందని, ఇది రెండుడోసులు తీసుకోవాల్సి వస్తుందని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ హెడ్ కిరిల్ దిమిత్రోవ్ పేర్కొన్నారు.
కరోనా వైరస్ ను గుర్తించటంలో శునకాల సాయం: అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు

మిగతా సంస్థలతో పోలిస్తే స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ రెండింతలు చౌకగా
మిగతా సంస్థలతో పోలిస్తే తమ వ్యాక్సిన్ రెండింతలు చౌకగా దొరుకుతుందని వారంటున్నారు. ఫిబ్రవరి నాటికి ఇది అందుబాటులోకి రావచ్చని చెప్తున్నారు.
క్లినికల్ ట్రయల్స్ లో ధ్రువీకరించిన 39 కేసులు, రెండు డోసులు తీసుకున్న 18 వేల 794 మంది వాలంటీర్ల లో స్పుత్నిక్ వీ 28వ రోజు 91.4%, 42 వ రోజు 95 % ప్రభావవంతంగా పని చేస్తోందని తేలిందని ప్రకటించారు. ప్రపంచంలో అత్యంత సమర్ధంగా పని చేస్తున్న వ్యాక్సిన్ తమదేనని, ఇక మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ లో 40 వేల మంది వాలంటీర్లు పాల్గొంటున్నారని వెల్లడించారు.

95 శాతం ప్రభావంతంగా పనిచేస్తోందన్న రష్యన్ సంస్థ
తొలి డోస్ తీసుకున్నవారిలో 42 రోజుల తర్వాత టీకా 95 శాతం ప్రభావంతంగా పనిచేస్తోందని వివరించారు. క్లినికల్ ట్రయల్స్2లో భాగంగా 22 వేల మంది వాలంటీర్లకు 42 రోజుల కిందట తొలి డోసు, 19 వేల మందికి 21 రోజుల కిందట రెండో డోసు ఇచ్చామని రెండో దశ క్లినికల్ ట్రయల్స్ మధ్యంతర ఫలితాలను గమలేయా నేషనల్ సెంటర్, ఆర్డీఐఎఫ్ సంయుక్తంగా వెల్లడించాయి.
క్లినికల్ ట్రయల్స్‌లో ధ్రువీకరించిన 39 కేసులు, రెండు డోస్‌లు తీసుకున్న 18,794 మంది వాలంటీర్లలో స్పుత్నిక్- వీ 28 వ రోజు 91.4 శాతం, 42 వ రోజు 95 శాతంపైగా ప్రభావవంతంగా పనిచేస్తోందని తేలిందని ప్రకటించింది.

మూడోదశ క్లినికల్ ట్రయల్స్ లోకి స్పుత్నిక్ వీ
ప్రపంచంలో అత్యంత సమర్థంగా పనిచేస్తున్న టీకా తమదేనని, మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో 40 వేల మంది వాలంటీర్లు పాల్గొంటున్నారని పేర్కొన్నాయి. అమెరికా సంస్థలైన ఫైజర్, మోడెర్నా లు ఇప్పటికే తమ వ్యాక్సిన్ 95% ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు ప్రకటించగా బ్రిటన్ కు చెందిన ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రా జెనికా తమ వ్యాక్సిన్ 70 శాతం పని చేస్తున్నట్లుగా ప్రకటించింది.
ఇక స్పుత్నిక్ వి 95 శాతం ప్రభావవంతంగా ఉన్నట్టు వెల్లడించడంతో పాటుగా, అన్ని వ్యాక్సిన్ ల కంటే చౌక ధరకే తమ వ్యాక్సిన్ అందుబాటులో ఉండనున్నట్లుగా పేర్కొంది.

ఆగస్ట్ లోనే ఆమోదం పొందిన తొలి వ్యాక్సిన్
బెలారస్, యూఏఈ, వెనిజులా తోపాటుగా భారత్‌లోనూ మూడవదశ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి లభించినట్లు గా వెల్లడించింది. 2021 మొదటి త్రైమాసికానికి 50 కోట్ల డోసుల ఉత్పత్తి ప్రారంభించేలా పలు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పేర్కొంది. ఆగస్టులోనే ఈ వ్యాక్సిన్ కు రష్యా ఆమోదం తెలపడంతో, ప్రపంచంలోనే క్లినికల్ ట్రయల్స్ ఆమోదం పొందిన తొలి వ్యాక్సిన్ గా స్పుత్నిక్ వీ ఉంది .
ప్రస్తుతం స్పుత్నిక్ వీ ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి మరియు భారతదేశంలో పంపిణీ చేయడానికి హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డి మరియు ఆర్డిఐఎఫ్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.

ఇండియాలో కొనసాగుతున్న క్లినికల్ ట్రయల్స్
ఈ రెండు సంస్థలకు వ్యతిరేకంగా టీకాకు ధర ప్రయోజనం ఉన్నప్పటికీ, ప్రత్యేకమైన శీతలీకరణ చేయవలసిన పరిస్థితులు తప్పనిసరి కాబట్టి పంపిణీ సవాల్ గా ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. అక్టోబరులో, డాక్టర్ రెడ్డి మరియు ఆర్ డి ఐ ఎఫ్ భారతదేశంలో వ్యాక్సిన్ కోసం రెండు, మూడు దశల మానవ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి అనుమతి పొందారు. భాగస్వామ్యంలో భాగంగా, ఆర్ డి ఐ ఎఫ్ 100 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్‌ను డాక్టర్ రెడ్డికి సరఫరా చేస్తుంది.